iDreamPost

హైదరాబాద్‌లో స్థలాలు కొనడం లాభమా? శివార్లలో కొనడం లాభమా?

స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? భవిష్యత్తులో ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారా? మరి హైదరాబాద్ లో స్థలాలు కొనడం లాభమా శివార్లలో కొనడం లాభమా? ఎక్కడ కొంటే లాభమంటే?

స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? భవిష్యత్తులో ఎక్కువ లాభాలను పొందాలనుకుంటున్నారా? మరి హైదరాబాద్ లో స్థలాలు కొనడం లాభమా శివార్లలో కొనడం లాభమా? ఎక్కడ కొంటే లాభమంటే?

హైదరాబాద్‌లో స్థలాలు కొనడం లాభమా? శివార్లలో కొనడం లాభమా?

ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మంది ఎంచుకునేది రియల్ ఎస్టేట్ రంగమనే చెప్పొచ్చు. స్థలాలపై పెట్టుబడి పెడితే అనుకున్నదానికంటే అధిక ప్రాఫిట్ రావడమే దీనికి గల కారణం. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో భూముల విలువ పెరగడం.. భవిష్యత్తులో కూడా స్థలాల ధరలకు రెక్కలు రానుండడంతో స్థిరాస్థిలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా స్థలాలపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? లక్షల్లో లాభాలను పొందాలనుకుంటున్నారా? మరి ఏ ఏరియాలో స్థలాలు కొంటే లాభాలు వస్తాయో తెలియడం లేదా? హైదరాబాద్ లో లేదా శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనడం వల్ల లాభమో నష్టమో తెలియడం లేదా? ఇంతకీ అసలు ఎక్కడ స్థలాలు కొంటే లాభమంటే?

హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కొలువుదీరుతున్నాయి. ఇన్వెస్టర్లు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో నగరంలోని దాదాపు అన్ని ఏరియాల్లో స్థలాల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం కూకట్ పల్లి ఏరియాలో చదరపు అడుగు ధర రూ. 6,350 పలుకుతోంది. ఈ ధరతో మీరు 1200 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేస్తే.. రూ. 76,20,000 అవుతుంది. అంటే మీకు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలంటే కాస్త ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సిటీ శివార్లలో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బీబీ నగర్ హైదరాబాద్-వరంగల్ హైవేకు ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం చదరపు అడుగు స్థలం ధర రూ. 1400 పలుకుతోంది. ఇదే ధరతో మీరు 900 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేశారనుకోండి.. అప్పుడు రూ. 12,60,000 అవుతుంది. అంటే తక్కువ పెట్టుబడితోనే మంచి స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు.

ఈ ఏరియాలో పెట్టుబడిపెట్టినట్లైతే తక్కువ పెట్టుబడితోనే మీరు స్థలాన్ని కొనుగోలు చేయొచ్చు. ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయా ఏరియాల్లో భవిష్యత్తులో స్థలాల ధరలు పెరగడం ఖాయమంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ క్రమంలో హైదరాబాద్ లో స్థలాలు కొనుగోలు చేస్తే ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. ఇదే సమయంలో కొంత కాలం తర్వాత రాబడులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. కానీ శివారు ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో స్థలాలను కొనుగోలు చేస్తే ఫ్యూచర్ లో ఎక్కువ లాభాలను పొందొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి హైదరాబాద్ లో కంటే శివారు ప్రాంతాల్లోనే లో ఇన్వెస్ట్ మెంట్ తో స్థలాలను కొనుగోలు చేసి కొంత కాలం తర్వాత అమ్ముకుంటే అధిక లాభాలను అందుకోవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి