iDreamPost

టిడిపిని రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉందా ?

టిడిపిని రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉందా ?

తెలుగుదేశంపార్టీని రీ డిజైన్ చేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. పార్టీని రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఏముందబ్బా ? అనే సందేహం అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే పేరుకే ఏపిలో ప్రతిపక్షాలున్నాయి కానీ అన్నీ పనిచేస్తున్నవి చంద్రబాబు ప్రయోజనాల కోసమే కదా ? అనే సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. ఏ విషయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై చంద్రబాబు ఏవైతో ఆరోపణలు చేస్తున్నాడో కాస్త అటు ఇటుగా అవే ఆరోపణలను మిగిలిన పార్టీలు కూడా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ రామకృష్ణ, కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ ఇలా… అందరూ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు కదా. గడచిన మూడు రోజులుగా విద్యుత్ బిల్లుల వ్యవహారంపై చంద్రబాబు ఏమి ఆరోపణలు చేశాడో మిగిలిన నేతలు కూడా ఇంచుమించు అవే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయమే తీసుకోండి చంద్రబాబు, చినబాబు ఏమంటే మిగిలిన నేతలు కూడా అవే రిపీట్ చేస్తున్నారు. కాకపోతే డాక్టర్ సుధాకర్ విషయం పవన్, కన్నా ఇంకా నోరిప్పలేదంతే.

మద్యం తాగేసి రోడ్లపై వీరంగం చేస్తున్నాడంటూ డాక్టర్ పై స్ధానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేటప్పటికి సుధాకర్ చొక్కా విప్పేసి రోడ్డుపై నానా గోల చేస్తున్నాడు. వెంటనే డాక్టర్ ను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జరిగింది ఇదైతే చంద్రబాబు అండ్ కో తో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం ఉల్టాగా ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. తప్పు చేసిన డాక్టర్ ను వదిలేసి పోలీసులే తప్పు చేసినట్లు గోల మొదలుపెట్టారు.

విషయం ఏదైనా కానీండి, నేతలు ఏ పార్టీల్లో అయినా ఉండనీండి అందరూ పనిచేస్తున్నది మాత్రం చంద్రబాబు కోసమే అన్న విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. మరి ఇన్ని పార్టీల నేతలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడిస్తున్న చంద్రబాబుకు టిడిపిని రీ డిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందా అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఒకవేళ రీ డిజైన్ చేసినా ఎలాగుంటుందో ? అన్న ఆసక్తి కూడా పెరిగిపోతోంది. చూద్దాం చంద్రబాబు చెప్పిన రీ డిజైన్ ఎలాగుంటుందో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి