iDreamPost

ఏబీ వెంకటేశ్వరరావు కు చుక్కెదురు

ఏబీ వెంకటేశ్వరరావు కు చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు కు క్యాట్ లో చుక్కెదురైంది. ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ ఆర్డర్ పై స్టే విధించాలనే అభ్యర్ధనను క్యాట్ తోసిపుచ్చింది. అవినీతి ఆరోపణలపై తనని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గురువారం కేంద్ర పరిపాలనా ట్రిభ్యునల్ (క్యాట్) ని ఆశ్రయించారు. శుక్రవారం క్యాట్ హైదరాబాద్ బెంచ్ లో జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున దేశాయ్ ప్రకాష్ రెడ్డి తన వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా డిజి స్థాయి అధికారిని కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారని క్యాట్ ప్రశ్నించింది. ఏబీ వెంకటేశ్వరావు ని సస్పెండ్ చేసిన విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కు తెలిపారా అని ట్రిబ్యునల్ ప్రభుత్వ తరుపు న్యాయవాదిని అడిగింది. సదరు అధికారికి గత ఎనిమిది నెలలనుండి జీతం ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే క్యాట్ సందేహాలను నివృత్తి చేసేందుకు తమకు వారంరోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో, అందుకు అంగీకరించిన ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి