iDreamPost

IPL 2024: గెలుపు సరే.. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే SRH కప్ కొట్టడం కష్టమే!

ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న SRH ఆ బలహీనతను అధిగమిస్తేనే టైటిల్ ను ముద్దాడుతుంది. మరి ఆ వీక్ నెస్ ఏంటి? తెలుసుకుందాం..

ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే సూపర్ ఫామ్ లో ఉన్న SRH ఆ బలహీనతను అధిగమిస్తేనే టైటిల్ ను ముద్దాడుతుంది. మరి ఆ వీక్ నెస్ ఏంటి? తెలుసుకుందాం..

IPL 2024: గెలుపు సరే.. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే SRH కప్ కొట్టడం కష్టమే!

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్. కానీ కప్పులు మాత్రం ఎక్కువగా కొట్టలేకపోతోంది. సీజన్, సీజన్ కు జట్టులో స్టార్ ప్లేయర్లు వస్తున్నప్పటికీ.. టైటిళ్లు సాధించడంలో విఫలం అవుతూ వస్తోంది. అయితే ఈ సీజన్ లో మాత్రం దుమ్మురేపే ఫర్ఫామెన్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి..పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్ లో కొనసాగుతోంది. అయితే అద్బుతమైన ఆటతీరులో టోర్నీలో ముందుకుసాగుతున్న సన్ రైజర్స్ టీమ్ ఈ కీలక తప్పును సరిదిద్దుకోకపోతే.. కప్ కొట్టడం కష్టమే అంటున్నారు క్రీడా నిపుణులు. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే?

ఎంతటి పోరాట యోధుడికైనా ఓ చిన్న బలహీనత ఉంటుంది. వరుసగా విజయాలు సాధిస్తూ వెళ్తున్నాం కదా అని ఆ బలహీనతను తక్కువగా చూస్తే.. దారుణ పరాజయం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇలాగే ఉంది. అద్భుతమైన విజయాలతో టోర్నీలో ముందుకు వెళ్తున్న హైదరాబాద్ టీమ్ ఓ బలహీనతను మాత్రం అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఆ వీక్ నెస్ పేరే బౌలింగ్. అవును బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్, అబ్దుల్ సమద్, నితిశ్ రెడ్డిలతో భీకరంగా ఉంది.

If this mistake is not corrected it will be difficult for SRH to win the cup!

ఇక షహబాజ్ అహ్మద్, ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆల్ రౌండర్లు ఉండనే ఉన్నారు. సన్ రైజర్స్ కు బ్యాటింగ్ లో ఎలాంటి ఢోకా లేదు. ఆ విషయం 277, 287 రికార్డు పరుగులు చేయడంలోనే తెలిసిపోతోంది. వచ్చిన సమస్యల్లా బౌలింగ్ ఒక్కటే. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచే కాదు.. అంతకు ముందు ముంబైతో జరిగిన మ్యాచ్ లో సైతం సన్ రైజర్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థికి 262 పరుగులు కొట్టే అవకాశం ఇచ్చారు అంటేనే మన బౌలింగ్ ఎలా ఉందో అర్దమవుతోంది.

మరో ఇబ్బంది కరమైన విషయం ఏంటంటే? ఈ మ్యాచ్ లో బౌలింగ్ వేసిన ప్రతీ బౌలర్ 10 ఎకానమీకి తక్కువగా పరుగులు ఇవ్వలేదు. సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నటరాజన్, కమ్మిన్స్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ కమ్మిన్స్ 3 వికెట్లు తీసినప్పటికీ.. రన్స్ ను కట్టడిచేయలేకపోయాడు. ఇలాంటి మెగా టోర్నీలో.. భారీగా పరుగులు చేయడమే కాదు.. వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. లేదంటే.. కొండంత లక్ష్యం కూడా ఐస్ ముక్కలా కరిగిపోవడం ఖాయం.

ఈ మ్యాచే కాదు.. ఈ సీజన్ లో ఆడిన గత మ్యాచ్ ల్లో సైతం హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటలేకపోతున్నారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడే కాస్త నిలకడగా రాణిస్తున్నాడు. 6 మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టాడు కమ్మిన్స్. ఇక నటరాజన్, జయదేవ్ ఉనద్కత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సన్ రైజర్స్ బౌలర్లు సమష్టిగా రాణిస్తే.. ఈసారి కప్పు కొట్టగలరు. బౌలింగ్ బలహీనతను అధిగమిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 విన్నర్ కాగలదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి