iDreamPost

Kuldeep Yadav: కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఈ గుగ్లీ వీడియోను తప్పక చూడాల్సిందే!

  • Published Apr 12, 2024 | 9:49 PMUpdated Apr 12, 2024 | 9:49 PM

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరో మ్యాజికల్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అతడి గుగ్లీ దెబ్బకు బ్యాటర్​కు మైండ్ బ్లాంక్ అయింది.

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరో మ్యాజికల్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అతడి గుగ్లీ దెబ్బకు బ్యాటర్​కు మైండ్ బ్లాంక్ అయింది.

  • Published Apr 12, 2024 | 9:49 PMUpdated Apr 12, 2024 | 9:49 PM
Kuldeep Yadav: కుల్దీప్ స్పిన్ మ్యాజిక్.. ఈ గుగ్లీ వీడియోను తప్పక చూడాల్సిందే!

ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇచ్చాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచులకు దూరమైన కుల్దీప్.. లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​తో రీఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే ఎల్​ఎస్​జీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్ ఓవర్​లోనే రెండు వికెట్లు తీసి అపోజిషన్ టీమ్​ను బ్యాక్​ సీట్​లోకి నెట్టాడు. తొలుత మార్కస్ స్టొయినిస్​ (8)ను ఔట్ చేసిన కుల్దీప్.. ఆ తర్వాతి బంతికే నికోలస్ పూరన్​ (0)ను గోల్డెన్ డక్​గా వెనక్కి పంపాడు. అనంతరం భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (39)ని ఔట్ చేశాడు కుల్దీప్. అయితే అతడు తీసిన 3 వికెట్లలో పూరన్ వికెట్ హైలైట్ అనే చెప్పాలి.

స్టొయినిస్ ఔట్ అవగానే క్రీజులోకి వచ్చాడు పూరన్. పిచ్​పై సెటిలై కెప్టెన్ రాహుల్​తో కలసి ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లాలని భావించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అద్భుతమైన గుగ్లీతో పూరన్​ను బోల్తా కొట్టించాడు కుల్దీప్. మిడ్ వికెట్ మీద పడిన బంతి బ్యాటర్ చూస్తుండగానే అతడ్ని దాటేసి వికెట్లను గిరాటేసింది. దాన్ని డిఫెండ్ చేసేందుకు పూరన్ ప్రయత్నించాడు. బాల్ అంత టర్న్ అవుతుందని అనుకోలేదతను. దీంతో పూర్తిగా ఓపెన్ అయి డిఫెన్స్ చేశాడు. అయితే ఊహించని విధంగా టర్న్ అయిన బంతి ఆ సందులో నుంచి దూరి వికెట్లను ముద్దాడింది. అంతే ఏం జరిగిందో అర్థం గాక పూరన్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. కుల్దీప్ గుగ్లీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pooran Bowled

కుల్దీప్ మ్యాజికల్ డెలివరీ చూసిన నెటిజన్‌.. ఇది కదా స్పిన్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. కుల్దీప్ తనకు తానే సాటి అని అంటున్నారు. ఇక, లక్నో ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. టాపార్డర్​లో రాహుల్ తప్ప అందరూ ఫెయిలయ్యరు. మిడిలార్డర్​లోనూ ఎవ్వరూ రాణించలేదు. అయితే ఆఖర్లో ఆయుష్ బదోని (35 బంతుల్లో 55 నాటౌట్) మెరుపు బ్యాటింగ్​తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను వణికించాడు. అతడికి ఆర్షద్ ఖాన్ (16 బంతుల్లో 20 నాటౌట్) మంచి సహకారం అందించాడు. బ్యాటింగ్​కు సహకరిస్తున్న పిచ్ మీద లక్నోను భారీ స్కోరు చేయకుండా కుల్దీప్ అడ్డుకున్నాడు. ఓ మాదిరి టార్గెట్​ను డీసీ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి. మరి.. కుల్దీప్ గుగ్లీ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి