iDreamPost

వీడియో: KL రాహుల్ సూపర్​మ్యాన్ క్యాచ్.. బ్యాటర్​తో పాటు లక్నో టీమ్ కూడా షాక్!

  • Published Apr 23, 2024 | 9:02 PMUpdated Apr 23, 2024 | 9:02 PM

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు తన వికెట్ కీపింగ్ స్కిల్స్ చూపించాడు. సూపర్​మ్యాన్ క్యాచ్​తో అందర్నీ సర్​ప్రైజ్ చేశాడు.

లక్నో సూపర్ జియాంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోమారు తన వికెట్ కీపింగ్ స్కిల్స్ చూపించాడు. సూపర్​మ్యాన్ క్యాచ్​తో అందర్నీ సర్​ప్రైజ్ చేశాడు.

  • Published Apr 23, 2024 | 9:02 PMUpdated Apr 23, 2024 | 9:02 PM
వీడియో: KL రాహుల్ సూపర్​మ్యాన్ క్యాచ్.. బ్యాటర్​తో పాటు లక్నో టీమ్ కూడా షాక్!

కేఎల్ రాహుల్ అంటే అందరూ స్పెషలిస్ట్ బ్యాట్స్​మనే అనుకుంటారు. అతడి పేరు చెప్పగానే బ్యూటిఫుల్ ఫ్లిక్స్ అందరికీ గుర్తుకొస్తాయి. స్టైలిష్ బ్యాటింగ్​తో అందరి మనసులు దోచుకున్నాడతను. టీమిండియా బ్యాటింగ్ యూనిట్​లో కీలకంగా మారిన రాహుల్.. ఐపీఎల్​లో లక్నో సూపర్ జియాంట్స్​కు కెప్టెన్​గానూ ఆకట్టుకుంటున్నాడు. స్వతహాగా కీపర్ కూడా అయిన ఈ స్టార్ ప్లేయర్.. వన్డే వరల్డ్ కప్​లో ఆ రోల్​ను సమర్థంగా పోషించాడు. టీ20 ప్రపంచ కప్​లో మళ్లీ అదే పాత్రతో టీమ్​లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​లోనూ తన వికెట్ కీపింగ్ స్కిల్స్​ను మరోమారు చూపించాడు.

సూపర్​మ్యాన్ క్యాచ్​తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు కేఎల్ రాహుల్. సీఎస్​కేతో జరుగుతున్న మ్యాచ్​లో ఓపెనర్ అజింక్యా రహానె (1) ఇచ్చిన క్యాచ్​ను అద్భుతంగా అందుకున్నాడు ఎల్​ఎస్​జీ కెప్టెన్. మ్యాట్ హెన్రీ వేసిన బంతి ఆఫ్ వికెట్ మీద పడి వస్తుండగా దాన్ని కవర్స్​లోకి బౌండరీగా తరలిద్దామని రహానె భావించాడు. అయితే బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వెనక్కి ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే వికెట్ల వెనుక కాచుకొని ఉన్న రాహుల్ రైట్ సైడ్ బాడీని స్ట్రెచ్ చేసి డైవ్ వేశాడు. దూకుతున్న సమయంలో అతడి కుడి కాలు పాదం మీదే మొత్తం భారాన్ని ఉంచాడు. దీన్ని చూసి బ్యాటర్ రహానెతో పాటు లక్నో టీమ్ కూడా షాకైంది. అతడి క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన సీఎస్​కే ప్రస్తుతం 14.4 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఉంది. మరి.. రాహుల్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి