iDreamPost

వీడియో: CSK ఆంథమ్ రిలీజ్.. కొత్త కెప్టెన్ కంటే ధోనీని హైలైట్ చేస్తూ..!

  • Published Mar 22, 2024 | 5:12 PMUpdated Mar 22, 2024 | 5:21 PM

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఆంథమ్ వచ్చేసింది. సరిగ్గా సీజన్ ఫస్ట్ మ్యాచ్​కు కొన్ని గంటల ముందు దీన్ని సీఎస్​కే రిలీజ్ చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ కొత్త ఆంథమ్ వచ్చేసింది. సరిగ్గా సీజన్ ఫస్ట్ మ్యాచ్​కు కొన్ని గంటల ముందు దీన్ని సీఎస్​కే రిలీజ్ చేసింది.

  • Published Mar 22, 2024 | 5:12 PMUpdated Mar 22, 2024 | 5:21 PM
వీడియో: CSK ఆంథమ్ రిలీజ్.. కొత్త కెప్టెన్ కంటే ధోనీని హైలైట్ చేస్తూ..!

ఐపీఎల్ నయా సీజన్ స్టార్ట్ అవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫస్ట్ మ్యాచ్​లో తాడోపేడో తేల్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయిపోయాయి. రుతురాజ్ సేనను ఎంకరేజ్ చేసేందుకు ఎల్లో ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ స్టేడియానికి ఆడియెన్స్ భారీగా తరలివస్తున్నారు. కెప్టెన్ మారడంతో ఈ మ్యాచ్​లో సీఎస్​కే ఎలా పెర్ఫార్మ్ చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో కొత్త జెర్సీలో ఫుల్ జోష్​తో కనిపిస్తున్న ఆర్సీబీ సీజన్​ను ఎలా స్టార్ట్ చేస్తుందనేది కూడా ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ తరుణంలో మ్యాచ్​కు కొన్ని గంటల ముందు సీఎస్​కే తమ కొత్త ఆంథమ్​ను రిలీజ్ చేసింది.

సీఎస్​కే ఆంథమ్ వచ్చేసింది. ఐపీఎల్​లో ఎన్ని టీమ్స్ ఉన్నా చెన్నై ఆంథమ్​కు మంచి క్రేజ్ ఉంది. ‘విజిల్ పొడు’ పేరుతో ఆ జట్టు ఆటగాళ్ల గురించి చెబుతూ సాగే ఈ పాటను మిగతా టీమ్స్ ఫ్యాన్స్ కూడా ఇష్టపడతారు. సాంగ్​లో ఉండే జోష్​, ఆటగాళ్ల డాన్సులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సీఎస్​కే ఆంథమ్ మీద అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు ఈ సాంగ్​ను తాజాగా రిలీజ్ చేసింది చెన్నై. స్టార్ట్ ది విజిల్స్ అంటూ ధోని చెప్పే డైలాగ్​తో ఈ సాంగ్ మొదలవుతుంది. ‘చెన్నై సూపర్ కింగ్స్​కు పెరియ విజిల్ అడింగ’ అంటూ మాస్ బీట్​తో సాగే ఈ పాట ఆఖరి వరకు అదే జోష్​తో ఉంటుంది. ఈ సాంగ్​లోని ఫస్ట్ ఫ్రేమ్​లో కొత్త కెప్టెన్ రుతురాజ్, పాత సారథి ఎంఎస్ ధోని మెరిశారు.

CSK Anthem

సీఎస్​కే కొత్త ఆంథమ్​లో మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర సహా యంగ్ ప్లేయర్స్ కూడా సందడి చేశారు. నయా కెప్టెన్ రుతురాజ్ కూడా సాంగ్​లో చాలా చోట్ల కనిపించాడు. అయితే ఆంథమ్​లో మెయిన్ హైలైట్ మాత్రం ధోని అనే చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సాంగ్ మొత్తం అతడే ఎక్కువగా కనిపించాడు. డైలాగ్స్ చెబుతూ, విజిల్స్ వేస్తూ, స్టైల్​గా నడుస్తూ, షాట్లు కొడుతూ అతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. పాట అయిపోతుండగా ఆఖర్లో హెలికాప్టర్​ షాట్​తో మరో షాక్ ఇచ్చాడు మాహీ. సీఎస్​కే ఆంథమ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాట సూపర్బ్​గా ఉందని అంటున్నారు. సాంగ్​లో ధోనీని చూపించిన తీరు అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సీఎస్​కే కొత్త ఆంథమ్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి