iDreamPost

Travis Head: SRHలోకి ట్రావిస్ హెడ్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడంటే..?

  • Published Dec 19, 2023 | 2:54 PMUpdated Dec 19, 2023 | 2:54 PM

ఐపీఎల్ మినీ వేలంను సన్​రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్​ను దక్కించుకుంది. హెడ్​ను హైదరాబాద్ ఎంత ధరకు సొంతం చేసుకుందంటే..!

ఐపీఎల్ మినీ వేలంను సన్​రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్​గా స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్​ను దక్కించుకుంది. హెడ్​ను హైదరాబాద్ ఎంత ధరకు సొంతం చేసుకుందంటే..!

  • Published Dec 19, 2023 | 2:54 PMUpdated Dec 19, 2023 | 2:54 PM
Travis Head: SRHలోకి ట్రావిస్ హెడ్.. ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే లీగ్ మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. క్యాష్ రిచ్ లీగ్​కు ముందు నిర్వహిస్తున్న మినీ ఆక్షన్ మొదలైపోయింది. ఈసారి వేలంలో చాలా మంది ఆటగాళ్లు పాల్గొంటున్నా కొందరు మాత్రం మంచి అటెన్షన్ తీసుకుంటున్నారు. వారిలో ఒకడు ట్రావిస్ హెడ్. ఇటీవల కాలంలో ఫార్మాట్​తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న ఈ డాషింగ్ ఆస్ట్రేలియా ఓపెనర్​ను ఐపీఎల్​లో ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. అయితే మొత్తానికి హెడ్​ను సన్​రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అతడి కోసం తీవ్ర పోటీ నెలకొంది. కీపర్​తో పాటు అద్భుతమైన బ్యాటర్ కూడా కావడంతో అతడ్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే చివరికి హైదరాబాద్ రూ.6.80 కోట్లకు ఈ ఆసీస్ స్టార్​ను సొంతం చేసుకుంది.

ట్రావిస్ హెడ్ రావడంతో సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు మరింత పటిష్టంగా తయారైంది. అతడి చేరికతో బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీమ్​లో ఎయిడెన్ మార్క్​రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ రూపంలో మంచి బ్యాటర్లు ఉన్నారు. ఇప్పుడు వారికి హెడ్ లాంటి విధ్వంసకర బ్యాట్స్​మన్​ జతకావడంతో బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. హెడ్​ రాకతో ఓపెనింగ్ కష్టాలు కూడా తీరిపోతాయి. అతడికి జతగా అవతలి ఎండ్​లో ఉన్న బ్యాటర్ స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు. బౌలర్లను ఉతికిఆరేసే పని హెడ్ చూసుకుంటాడు. కీపింగ్​ చేస్తూ బౌలర్లు, కెప్టెన్​కు అవసరమైన సలహాలు, సూచనలు కూడా అందిస్తుంటాడీ ఆసీస్ స్టార్.

ట్రావిస్​ హెడ్​ను ఎక్స్​పెక్ట్ చేసిన దాని కంటే కాస్త తక్కువ ధరకే ఎగరేసుకుపోయింది సన్​రైజర్స్. ఈ స్టార్ ప్లేయర్​ను కొన్నాక కూడా హైదరాబాద్ పర్స్​లో మరో 27.20 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులతో స్పిన్ ఆల్​రౌండర్ లేదా పేసర్ కోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో యాన్సెన్ లాంటి పేసర్లకు తోడుగా మరో నిఖార్సయిన పేసర్ లేదా స్పిన్ ఆల్​రౌండర్​ను తీసుకునేందుకు ఎస్​ఆర్​హెచ్ ప్రయత్నించే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా టీమ్ బాగానే ఉన్నా మ్యాచ్​ను ఒంటిచేత్తో టర్న్ చేసే సత్తా ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్​ హైదరాబాద్​కు కావాలి. పర్స్​లో భారీగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి మిగిలిన స్టార్ ప్లేయర్ల కోసం ఎస్​ఆర్​హెచ్​ భారీగా బిడ్డింగ్ చేసే ఛాన్స్ ఉంది. మరి.. ఈ ఆక్షన్​లో ఇంకా ఎవరెవర్ని ఎస్​ఆర్​హెచ్ దక్కించుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్​పై కీలక అప్​డేట్.. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందంటే..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి