iDreamPost

Pat Cummins: కమిన్స్ కోసం రూ.20 కోట్లు! 10 ఏళ్ళ కష్టం తీర్చడానికే కావ్య ప్లాన్!

ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పై రూ. 20.50 కోట్లు కుమ్మరించింది SRH. ఇదంతా కావ్య మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. మరి కమ్మిన్స్ పై ఇంత మెుత్తంలో పెట్టుబడి పెట్టడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పై రూ. 20.50 కోట్లు కుమ్మరించింది SRH. ఇదంతా కావ్య మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. మరి కమ్మిన్స్ పై ఇంత మెుత్తంలో పెట్టుబడి పెట్టడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Pat Cummins: కమిన్స్ కోసం రూ.20 కోట్లు! 10 ఏళ్ళ కష్టం తీర్చడానికే కావ్య ప్లాన్!

సన్ రైజర్స్ హైదరాబాద్.. పేరులో రైజింగ్ ఉంది కానీ.. టీమ్ లో మాత్రం లేదు. అందుకే ప్రతీ ఐపీఎల్ సీజన్ లో తీసికట్టుగా ఫెర్మామెన్స్ చేస్తూ తీవ్ర విమర్శల పాలవుతోంది. అప్పుడెప్పుడో డెక్కన్ చార్జర్స్ పేరుతో 2009లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్ క్రిష్ట్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. ఆ తర్వాత 2016లో బెంగళూరును ఓడించి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి ప్రతీ సీజన్ లో SRHపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకోవడం, అవి నిరాశలుగా మిగలడం పరిపాటిగా వస్తోంది. అయితే ఈసారి అలా జరగకుండా పక్కా ప్లాన్ తో వేలం బరిలోకి దిగింది కావ్యా మారన్. ప్రణాళికల్లో భాగంగానే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పై రూ. 20.50 కోట్లు కుమ్మరించింది. ఇదంతా కావ్య మాస్టర్ ప్లాన్ తోనే జరిగింది. మరి కమ్మిన్స్ పై ఇంత మెుత్తంలో పెట్టుబడి పెట్టడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2024 వేలం.. ప్రస్తుతం అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తాయి. ఈ క్రమంలో ఫ్రాంచైజీల మధ్య హోరాహోరి పోరు జరుగుతుంది. దీంతో ప్లేయర్ జాక్ పాట్ కొట్టి భారీ ధరను సొంతం చేసుకుంటాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. భారీ ధరకు అమ్ముడుపోతూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన వేలంలో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ను రూ. 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అయితే SRH ఓనర్ కావ్యా మారన్ ప్యాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేయడం వెనక మాస్టర్ ప్లానే ఉందట. ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన కెప్టెన్ అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా తాజాగా ఆసీస్ కు వరల్డ్ కప్ ను అందించాడు. ఇవే కాకుండా కమ్మిన్స్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా తన సేవలను జట్టుకు అందిస్తున్నాడు. అతడి గత రికార్డులు చూసుకుంటే.. 2015 ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు కమ్మిన్స్. దీంతో పాటుగా 2021 టీ20 ప్రపంచ కప్ తో పాటుగా టెస్ట్ ఛాంపియన్ షిప్, యాషెస్ సిరీస్ లను కంగారూ టీమ్ కు అందించి.. తిరుగులేని నాయకుడు అనిపించుకున్నాడు. ఇలాంటి లక్షణాలు కల సారథి కోసమే ఇన్నాళ్లుగా సన్ రైజర్స్ యాజమాన్యం ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలోనే ఇలాంటి టైమ్ లో కమ్మిన్స్ వారికి మేలిమి రత్నంలా కనిపించాడు. అందుకే అతడిని ఎలాగైనా దక్కించుకోవాలని భావించే.. రూ. 20 కోట్లు కుమ్మరించింది. అదీకాక గంటకు 145 కి.మీ వేగంతో బంతులు వేస్తుంటాడు కమ్మిన్స్. ఇటు బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న స్టార్ ప్లేయర్ కాబట్టే.. గత పదేళ్లుగా సన్ రైజర్స్ పడుతున్న కష్టాన్ని తీర్చడానికే అతడిపై అంత మెుత్తం పెట్టుబడిపెట్టారు. ఒక బ్యాటర్ గా, ఒక నాయకుడిగా జట్టును ఎలా నడిపించాలో ఆసీస్ కెప్టెన్ కు తెలుసుకాబట్టే.. ఇంతలా అతడికి డిమాండ్ పెరిగింది. మరి కమ్మిన్స్ సన్ రైజర్స్ కష్టాన్ని తీరుస్తాడా? అతడిపై ఇంత భారీ మెుత్తంలో కావ్యా పాప డబ్బులు పెట్టడం మీకేవిధంగా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి