iDreamPost

రేవంత్ ప్రమాణ స్వీకారం.. ఆ కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం!

Revanth Reddy: గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రత్యేక అతిథులుగా కొన్ని కుటుంబాలను ఆహ్వానించారు.

Revanth Reddy: గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. వీరితో పాటు ప్రత్యేక అతిథులుగా కొన్ని కుటుంబాలను ఆహ్వానించారు.

రేవంత్ ప్రమాణ స్వీకారం.. ఆ కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అంతేకాక సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగనుంది. లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక  రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు ఆ కుటుంబాలకు ప్రత్యేక అతిథులు ఆహ్వానిస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లు హాజరుకానున్నారు.  అంతేకాక ప్రమాణ స్వీకారానికి శ్రీకాంత్ చారి వంటి 300 మంది అమరవీరుల కుటుంబాలను టీపీసీసీ ఆహ్వానించింది. అదే విధంగా ప్రొఫెసర్ కోదండరాం వంటి 250 మంది తెలంగాణ ఉద్యమకారులను కూడా పిలిచింది. అసలు ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే రేవంత్ రెడ్డి అమరవీరులను తలుచుకుని భావోద్వేగామైన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక దాదాపు పేదళ్ల తరువాత కాంగ్రెస్ సాధించిన విజయం అమరులకు అంకితమని ప్రకటించారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలకు,ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం అందింది. రేవంత్ స్వయంగా ఢిల్లీ వెళ్లి అగ్రనేతలకు ఆహ్వానం అందించారు. వీరితో పాటు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు ఆహ్వానించారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోత్, భూపేష్ బఘేల్, అశోక్ చౌహాన్ లకు కూడా ఆహ్వానం అందించారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఇన్ ఛార్జీలుగా పని చేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియాలను కూడా ఈ వేడుకు పిలిచారు.

తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మాజీ స్పీకర్ మీరాకుమార్, చిదంబరం, సుశీల్ కుమార్ తదితరులు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి తన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి 300 అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించడం సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారిని ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానిచడంపై ప్రశంసలు వస్తున్నాయి. మరి..అమరవీరుల కుటుంబాలకు  ఆహ్వానం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి