iDreamPost

TS Budget 2024: పేదలకు తీపి కబురు.. నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులు!

తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సొంతళ్లు లేని పేద ప్రజలకు తీపిక కబురు అందించారు.

తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సొంతళ్లు లేని పేద ప్రజలకు తీపిక కబురు అందించారు.

TS Budget 2024: పేదలకు తీపి కబురు.. నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులు!

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకం చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు పథకాల హామీ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని..తర్వతో అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇళ్లు లేని పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పలు పథకాలు.. వాటికి కేటాయించిన బడ్జెట్ గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా తెలంగాణ పేద ప్రజలకు తీపి కబురు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కిద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తామని, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు అసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందగలిగే నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని, కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టి తెలంగాణ ప్రజలకు లబ్ది చేకూర్చేలా వినియోగిస్తామని మంత్రి భట్టి తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తామని అన్నారు. ఈ పథకానికి ప్రస్తుతం బడ్జెట్ లో రూ.7,740 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో నిజమైన అర్హులను ఎంపిక చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిలించి.. అర్హులైన వారికే కేటాయిస్తామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి