iDreamPost

CSpace న‌వంబ‌ర్ 1 నుంచి కేర‌ళ ప్ర‌భుత్వ సొంత ఓటీటీ

CSpace న‌వంబ‌ర్ 1 నుంచి కేర‌ళ ప్ర‌భుత్వ సొంత ఓటీటీ

 

ఇప్పుడంతా ఓటీటీ (OTT) హవానే . ఓటీటీ (OTT) చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహాల‌తోపాటు కొత్త‌ ఫ్లాట్ ఫార్మ్స్ పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా జ‌నం వీటికి బాగానే అల‌వాటుప‌డ్డారు. ఇంటి బయటకు అడుగు పెట్టకుండానే, ఓటీటీ (OTT) చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదే ట్రెండ్ ఇక కంటిన్యూ అవుతుంది. ఇందులోకి కేరళ ప్రభుత్వం ఎంట్రీ ఇస్తోంది. సీస్పేస్ (CSpace)పేరుతో ఓటీటీ సంస్థను ఏర్పాటు చేసింది. సీస్పేస్ ను నవంబర్‌ 1న అధికారికంగా ప్రారంభించ‌నుంది. ఆరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం. కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది. సినిమాలు, వెబ్ సీరీస్, వినోద కార్యక్రమాలను స్ట్రీమింగ్ చేయ‌నుంది. సినిమాల రిజిస్ట్రేషన్ లు జూన్ 1 నుంచి ప్రారంభిస్తామని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్‌ తెలిపారు. .

దేశంలో ఇది తొలి ప్ర‌భుత్వ ఓటీటీ ప్లాట్ ఫామ్. మ‌ల‌యాళం సినిమా ఎదుగుద‌ల‌కు, చిన్న సినిమాలు, మంచి సినిమాల కోసం సీస్పేస్ ప‌నిచేయ‌నుంది. క‌మ‌ర్షియ‌ల్ పంథాలో న‌డిచినా విలువ‌లున్న సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తుంది. అలాగ‌ని సినిమా ఇండ‌స్ట్రీలో జోక్యం చేసుకోదు. సినిమా వ్యాపారానికి సంబంధంలేదు. థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన త‌ర్వాతే స్ట్రీమింగ్ చేస్తారు.

మ‌రి ఎలాంటి సినిమాల‌ను స్ట్రీమింగ్ చేస్తారు? బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో సంబంధంలేకుండా మంచి సినిమాల‌తోపాటు, అంత‌ర్జాతీయంగా అవార్డులు సాధించిన సినిమాలు, ప్ర‌తియేడూ కేర‌ళ నిర్వ‌హించే annual International Film Festival of Kerala (IFFK)లో ప్ర‌ద‌ర్శించే సినిమాలు, డాక్యుమెంట‌రీలు యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి