iDreamPost

పొడవైన జుట్టుతో మహిళ గిన్నిస్ రికార్డు!

సాధారణంగా మహిళలు తమ కేశాలంకరణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. పొడవైన జుట్టు కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.. రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

సాధారణంగా మహిళలు తమ కేశాలంకరణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. పొడవైన జుట్టు కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.. రక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

పొడవైన జుట్టుతో మహిళ గిన్నిస్ రికార్డు!

సాధారణంగా మహిళలకు కేశాలంకరణ అంటే ఎంతో ఇష్టం. మహిళల కురులపై ఎంతో శ్రద్ద వహిస్తుంటారు.. అందమైన కురులు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని అంటారు. ఇటీవల దేశంలో భారతీయ మహిళలు పలు ఫిజికల్ ఫీచర్లతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నారు. ఈ జాబితో మరో మహిళ చేరింది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ మహిళ పొడవైన జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

భారత దేశం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్మితా శ్రీవాత్సవ (46) తన 14వ ఏట నుంచి జుట్టు పెంచుకుంటూ వస్తుంది. ఈ విషయంలో తన తల్లే తనకు స్ఫూర్తి అంటుంది స్మీతా శ్రీవాత్సవ. అందమైన పొడవైన కురుల కోసం మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జుట్టు రాలుతుంటే కంగారు పడతారు.. జుట్టు పెరగడం కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్, షాంపులు వాడుతుంటారు. ఈ క్రమంలోనే స్మీతా తన జుట్టుకి ఎలాంటి   ప్రొడక్ట్స్ వాడకుండా పెంచుతూ వచ్చింది. స్మీత జుట్టు ఏకంగా 7 అడుగులు 9 అంగుళాలు.

1980 లో సినీ నటీమణులు పొడవైన జడలు చూడటానికి ఎంతో ఆకర్షనీయింగా కనిపించేవారు.. వాళ్లను చాలా మంది అనుకరించేవారు. ఈ క్రమంలోనే తన జుట్టు పొడవుగా ఇతరులకు భిన్నంగా ఉండాలని చిన్న తనంలోనే నిర్ణయం తీసుకుంది. స్మిత శ్రీ వాస్తవ తన జుట్టును 14 వ ఏట నుంచి కత్తిరించకుండా జాగ్రత్తగా పెంచడం మొదలు పెట్టింది. స్మీతా వారానికి రెండుసార్లు తల స్నానం చేస్తారట. ఆమె స్నానానికి సుమారు మూడు నాలుగు గంటల సమయం తీసుకుంటుందట. ఇక తన జుట్టు ఆరబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుందట. తాను కన్న కల నెరవేరిందని.. అంతేకాదు తన పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.. దేవుడు నా ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు అని అటుంది స్మిత శ్రీవాత్సవ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి