iDreamPost

అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్ అవార్డు గెలుచుకున్న ఓ ఇండియన్ రెస్టారెంట్

అమెరికాలో బెస్ట్ రెస్టారెంట్ అవార్డు గెలుచుకున్న ఓ ఇండియన్ రెస్టారెంట్

మన ఇండియన్ వంటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. విదేశీయులు సైతం మన ఇండియన్ ఫుడ్స్ కి ప్రేమికులే. విదేశీయులు ఇక్కడికి వచ్చినా, మనం విదేశాల్లో రెస్టారెంట్ పెట్టినా ఇండియన్ ఫుడ్ కి మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా అమెరికా న్యూయార్క్ లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ ఆ దేశ అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఎంపికైంది. నార్త్ కరోలినా యాష్‌విల్‌లోని ‘చాయ్ పానీ(Chai Pani)’ అనే రెస్టారెంట్ ఈ అవార్డుని గెలుచుకుంది.

అమెరికాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్, కుక్స్, ఫుడ్ ని గుర్తించేందుకు జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రకటిస్తుంటారు. అత్యుత్తమ రెస్టారెంట్‌, షెఫ్‌, బేకర్‌ ఇలా పలు కేటగిరీల్లో విజేతలను ఎంపిక చేస్తారు. కరోనా వల్ల గత రెండేళ్లు రెస్టారెంట్‌లు తాత్కాలికంగా మూతపడటంతో 2020, 2021లో ఈ అవార్డుని ఇవ్వలేదు. తాజాగా ఈ అవార్డుల్ని మళ్ళీ 2022కి గాను ఇచ్చారు.

ఈ అవార్డుల కార్యక్రమం తాజాగా జరగగా నోరూరించే ‘చాట్‌’ లాంటి పలు దేశీయ స్ట్రీట్‌ ఫుడ్‌ ని అందుబాటు ధరలలో అందించే చాయ్ పానీ అనే ఇండియన్ రెస్టారెంట్‌ను బెస్ట్ రెస్టారెంట్ గా ఎంపిక చేశారు. దీనిని భారతదేశానికి చెందిన మెహెర్‌వాన్‌ ఇరానీ స్థాపించారు. న్యూయార్క్ లోని పలు పెద్ద పెద్ద హోటల్స్‌ను పక్కకు నెట్టి ఈ అవార్డుని గెలుచుకుంది చాయ్ పానీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి