iDreamPost

శ్రీలంకను పోయించిన టీమిండియా పేసర్లు.. ఇది బౌలింగ్ అంటే..!

టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అజేయ భారత్ గా తన సత్తా చాటుతోంది.

టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అజేయ భారత్ గా తన సత్తా చాటుతోంది.

శ్రీలంకను పోయించిన టీమిండియా పేసర్లు.. ఇది బౌలింగ్ అంటే..!

టీమిండియా వన్డే వరల్డ్ కప్ లో ఓటమెరుగని జట్టుగా దూసుకెళ్తోంది. టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అజేయ భారత్ గా తన సత్తా చాటుతోంది. గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తూ అలవోకగా విజయాలను సాధిస్తోంది. కాగా నేడు లీగ్ మ్యాచ్ లలో భాగంగా వాంఖడే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఏ విభాగంలోను లంక భారత్ కు పోటీ ఇవ్వలేక పోయింది. భారత పేస్ బౌలర్ల ధాటికి శ్రీలంక విలవిల్లాడిపోయింది. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో లంక ఘోర పరాజయం పాలైంది. 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సెమీస్ లోకి అడుగు పెట్టింది.

అయితే ఈ మ్యాచ్ లో బూమ్రా, సిరాజ్, షమీ తమ బౌలింగ్ తో విశ్వరూపం ప్రదర్శించారు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించారు. వచ్చిన బ్యాటర్లను వచ్చినట్టే కనీసం సింగిల్ కూడా తీయనీయకుండానే పెవిలియన్ బాట పట్టించారు. దీంతో లంక టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఆ జట్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే స్టార్ బౌలర్ బుమ్రా వేసిన మొదటి ఓవర్ మొదటి బాల్ కే నిసంకను(00) డకౌట్ చేశాడు. ఐదు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత సిరాజ్ చెలరేగిపోయాడు. కరుణరత్న(00), మెండీస్(01), సమరవిక్రమ(00) ల వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

ఏడు ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భీకర ఫామ్ లో ఉన్న మహమ్మద్ షమీ ఆకావమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. హసలంక(01), మ్యాథ్యూస్(12),హేమంత్(00), చమీర(00), రజిత(14)ల వికెట్లను పడగొట్టిన షమీ లంక పతనానికి కారణమయ్యాడు. లంక టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా 0,0,1,0,1 పరుగులు చేసి ఔటైన తీరు చూస్తే భౌరత బౌలర్లు ఏ రేంజ్ లో బౌలింగ్ చేశారో తెలిసిపోతోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ తో భారత్ పేస్ బౌలర్ల ముందు ఏ జట్టైనా తేలిపోవాల్సిందేనన్న సంకేతాలిచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి