iDreamPost

IND vs ENG: వీడియో: అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. వరల్డ్ కప్ ఫైనల్​ను గుర్తుచేసిన స్టార్ ప్లేయర్!

  • Published Feb 03, 2024 | 3:11 PMUpdated Feb 03, 2024 | 3:11 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్ కప్​ను అతడు గుర్తుచేశాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. తద్వారా వన్డే వరల్డ్ కప్​ను అతడు గుర్తుచేశాడు.

  • Published Feb 03, 2024 | 3:11 PMUpdated Feb 03, 2024 | 3:11 PM
IND vs ENG: వీడియో: అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. వరల్డ్ కప్ ఫైనల్​ను గుర్తుచేసిన స్టార్ ప్లేయర్!

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్​లో భారత్ 396 పరుగులు చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లు అందరూ ఫెయిలైనా, టెయిలెండర్లు సహకరించకపోయినా చివరి వరకు పోరాడాడు జైస్వాల్. ఒక్కడే ఒక ఎండ్​లో పాతుకుపోయి ఫెంటాస్టిక్ బ్యాటింగ్​తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లండ్​కు మంచి స్టార్ట్ దొరికింది. జాక్ క్రాలే (76), బెన్ డకెట్ (21) కలసి తొలి వికెట్​కు 59 పరుగులు జోడించారు. ఓవర్​కు 6 పరుగుల రన్​రేట్​తో బ్యాటింగ్​ చేశారు. పిచ్ స్లోగా ఉండటం, పెద్దగా స్పిన్​కు అనుకూలించకపోవడం, రన్స్ ఈజీగా వస్తుండటంతో భారత్ ఒత్తిడిలో పడింది. కానీ అక్షర్ పటేల్ వేసిన డెలివరీకి క్రాలే ఔటయ్యాడు. అతడు ఇచ్చిన క్యాచ్​ను శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ఇదో స్పెషల్ క్యాచ్ అనే చెప్పాలి.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్​లో క్రాలే సూపర్బ్​గా బ్యాటింగ్ చేశాడు. అతడు చేసిన 76 పరుగుల్లో 11 ఫోర్లు, 2 భారీ సిక్సులు ఉన్నాయి. బౌండరీలు, సిక్సర్ల ద్వారా 56 పరుగులు రాబట్టాడు క్రాలే. విధ్వంసక బ్యాటింగ్​తో డేంజరస్​గా కనిపించిన క్రాలేను ఓ స్టన్నింగ్ క్యాచ్​తో వెనక్కి పంపాడు అయ్యర్. ఆ ఓవర్​లో బ్యాటర్​ను బాగా సెట్ చేశాడు అక్షర్ పటేల్. స్పిన్ డెలివరీస్ వేస్తూ హఠాత్తుగా స్ట్రయిట్ బాల్ వేశాడు. దీంతో క్రాలే షాట్ కొట్టగా బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేవగా వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లిన అయ్యర్ క్యాచ్​ను అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్​తో రెండు వరల్డ్ కప్స్​ను గుర్తుచేశాడు టీమిండియా స్టార్ ప్లేయర్. వన్డే వరల్డ్ కప్​-2023తో పాటు 1983 ప్రపంచ కప్​ను కూడా తన ఎఫర్ట్​తో అయ్యర్ గుర్తుచేశాడు.

SHREYAS IYER SUPERB CATCH

41 ఏళ్ల కింద అంటే 1983లో జరిగిన వన్డే వరల్డ్ కప్​లో అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ ఓ సూపర్బ్ క్యాచ్ పట్టాడు. వెస్టిండీస్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో డేంజరస్ బ్యాటర్ వీవీఎన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్​ను కపిల్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అందుకున్నాడు. క్రికెట్ హిస్టరీలో బెస్ట్ క్యాచెస్​లో ఒకటిగా దీన్ని చెబుతుంటారు. గతేడాది జరిగిన ప్రపంచ కప్​లో ఇదే తరహాలో ఓ క్యాచ్ పట్టాడు ఆస్ట్రేలియా ప్లేయర్ హెడ్. గ్లెన్ మ్యాక్స్​వెల్ బౌలింగ్​లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన బాల్​ను కపిల్ తరహాలో వెనక్కి పరిగెత్తుకుంటూ ఒడిసి పట్టాడు హెడ్. ఆ క్యాచ్​తో మ్యాచ్ టర్న్‌ అయింది. ఇవాళ ఇంగ్లండ్​తో మ్యాచ్​లో అయ్యర్ కూడా ఇదే తరహాలో క్యాచ్ పట్టి క్రాలేను వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ పతనం స్టార్ట్ అయింది. మరి.. అయ్యర్ పట్టిన క్యాచ్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి