iDreamPost

మొదటి టెస్ట్​లోనే ఇంగ్లాండ్​ను వణికించాడు.. ఎవరీ ఆకాశ్ దీప్?

  • Published Feb 23, 2024 | 11:51 AMUpdated Feb 23, 2024 | 11:54 AM

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డెబ్యూ బౌలర్ ఆకాశ్ దీప్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ యంగ్ పేసర్.

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా డెబ్యూ బౌలర్ ఆకాశ్ దీప్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడీ యంగ్ పేసర్.

  • Published Feb 23, 2024 | 11:51 AMUpdated Feb 23, 2024 | 11:54 AM
మొదటి టెస్ట్​లోనే ఇంగ్లాండ్​ను వణికించాడు.. ఎవరీ ఆకాశ్ దీప్?

కెరీర్​లో ఫస్ట్ మ్యాచ్ అంటే ఏ ఆటగాడైనా కాస్త టెన్షన్​ పడతాడు. వచ్చిన ఛాన్స్​ను సద్వినియోగం చేసుకొని టీమ్​లో తన ప్లేస్​ను పక్కా ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటాడు. తీవ్ర ఒత్తిడి, అంచనాల మధ్య ఇంటర్నేషనల్ లెవల్లో రాణించడం అంత ఈజీ కాదు. కానీ భారత యంగ్ పేసర్ ఆకాశ్​ దీప్ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే ఇవన్నీ పెద్ద విషయం కాదని ప్రూవ్ చేశాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడుతున్నాడతను. రెస్ట్ వల్ల టీమ్​కు దూరమైన జస్​ప్రీత్ బుమ్రా ప్లేసులో టీమ్​లోకి వచ్చిన ఆకాశ్.. మొదటి టెస్టులో ఇంగ్లాండ్​ను వణికిస్తున్నాడు. బుల్లెట్ స్పీడ్​తో అతడు వేసే బంతులు స్వింగ్ కూడా అవుతుండటంతో ఇంగ్లీష్​ బ్యాటర్లు గజగజలాడుతున్నారు. అలాంటి ఆకాశ్ దీప్ ఎవరు? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ తక్కువ వ్యవధిలో 3 కీలక వికెట్లు తీశాడు. ఇంగ్లీష్ ఓపెనర్లు జాక్ క్రాలే (42), బెన్ డకెట్ (11) సహా మరో స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ (0)ను కూడా వెనక్కి పంపాడతను. ఇంగ్లాండ్​​కు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ఆకాశ్.. ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో శ్రమించాడు. బిహార్​లోని ససారం అనే గ్రామంలో జన్మించాడీ పేసర్. మిడిల్​క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఆకాశ్​ చిన్నతనం నుంచే క్రికెట్​ను విపరీతంగా ఇష్టపడేవాడు. అయితే క్రికెట్​ వైపు అడుగులు పడుతున్న టైమ్​లో అతడి లైఫ్​లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో అతడి తండ్రి మరణించాడు. అది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆకాశ్ సోదరుడు కూడా కన్నుమూశాడు. ఇన్ని కష్టాలు ఎదురైనా అతడు మాత్రం మొక్కవోని సంకల్పంతో, పట్టుదలతో తన కెరీర్​ను మలచుకున్నాడు. సొంత రాష్ట్రం బిహార్​లో ఛాన్సులు తక్కువగా ఉండటంతో వెస్ట్ బెంగాల్​కు తన మకాం మార్చాడు.

బెంగాల్​కు వెళ్లాక ఒక క్రికెట్ అకాడమీలో చేరాడు ఆకాశ్ దీప్. అనంతరం అసన్సోల్​లోని ఖేప్ క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్​లో సూపర్బ్​గా పెర్ఫార్మ్ చేశాడు. దీంతో అతడికి దుబాయ్​కు వెళ్లే అవకాశం దక్కింది. అక్కడ కూడా దుమ్మురేపడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ డివిజన్ మ్యాచుల్లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్​దీప్ ముఖర్జీ దృష్టిలో పడ్డాడు. అతడు బౌలింగ్ చేస్తుంటే కీపర్ వెనుక 10 గజాల దూరంలో నిల్చోవడం చూసి జోయ్​దీప్ షాకయ్యాడు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్​ను పిలిచి ఆకాశ్​ గురించి తెలుసుకున్నాడు. ఆ టైమ్​లో బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్​గా ఉన్న సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విజన్-2020 ప్రోగ్రామ్​కు ఆకాశ్ దీప్​ను రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్​లో టర్నింగ్ పాయింట్​గా నిలిచింది.

గంగూలీ విజన్-2020 ప్రోగ్రామ్​కు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆకాశ్ దీప్​కు చోటు దక్కింది. అలా బెంగాల్ స్టేట్ టీమ్​కు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్​లో అతడు పాల్గొన్నాడు. అనంతరం 2019లో బెంగాల్ తరఫున ఆకాశ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో అడుగుపెట్టాడు. అదే సంవత్సరం డొమెస్టిక్ క్రికెట్​లో టీ20ల్లోనూ అరంగేట్రం చేశాడు. ఓవరాల్​గా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లు ఆడిన ఆకాశ్.. 104 వికెట్లు తీశాడు. అతడిలోని ప్రతిభను సెలక్టర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ గుర్తించారు. నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలగడం, బాల్​ను ఇరువైపులా స్వింగ్ చేయగలగడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో దుమ్మురేపడంతో భారత్ టీమ్​లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు ఆకాశ్. టీమ్ మేనేజ్​మెంట్ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో 3 వికెట్లు పడగొట్టి తాను ఎంత డేంజరస్ బౌలరో ప్రూవ్ చేసుకున్నాడు. మరి.. ఆకాశ్ దీప్ డెబ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ ఇద్దరు భారత క్రికెటర్లు అంటే చాలా ఇష్టం.. ‘దేవర’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి