iDreamPost

వరల్డ్ కప్ ఫైనల్​లో రోహిత్ శర్మ నాటౌట్.. ఇదిగో ప్రూఫ్​!

  • Author singhj Updated - 02:59 PM, Thu - 23 November 23

వరల్డ్ కప్​-2023 ఫైనల్​లో రోహిత్ శర్మ ఔట్ అవ్వడం టీమిండియా విజయంపై ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్ ఔట్ కాలేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

వరల్డ్ కప్​-2023 ఫైనల్​లో రోహిత్ శర్మ ఔట్ అవ్వడం టీమిండియా విజయంపై ఎంత ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్ ఔట్ కాలేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు.

  • Author singhj Updated - 02:59 PM, Thu - 23 November 23
వరల్డ్ కప్ ఫైనల్​లో రోహిత్ శర్మ నాటౌట్.. ఇదిగో ప్రూఫ్​!

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్​లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడం ఫ్యాన్స్​ను ఇప్పటికీ కలచివేస్తోంది. లీగ్ స్టేజ్​లో అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఈసారి కప్​ మనదేనన్న భరోసాను ఇచ్చింది రోహిత్ సేన. ఎదురొచ్చిన ప్రతి అపోజిషన్ టీమ్​పై ఈజీగా గెలుస్తూ వీర ఫామ్​లో కనిపించింది. నాకౌట్ మ్యాచ్​లో న్యూజిలాండ్​ టీమ్​ను కూడా చిత్తుగా ఓడించి కప్పుపై ఎక్స్​పెక్టేషన్స్​ను మరింతగా పెంచింది. అయితే ఫైనల్​లో ఎదురుగా ఉన్నది ఆసీస్. 2003 ఫైనల్​లో భారత్​ను ఓడించిన టీమ్ అది. ఐసీసీ టోర్నీల్లో ఫైనల్​కు వస్తే కంగారూ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. దీంతో ఈసారి కప్ కష్టమేనా? అనే అనుమానాలు. కానీ సూపర్ ఫామ్​లో ఉన్న రోహిత్ సేన ఈసారి మ్యాజిక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఫైనల్​లో ఒత్తిడికి లోనైన భారత్​ కప్ మిస్ చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్​లో మన జట్టు ఓటమికి కారణాలు ఇవేనంటూ సీనియర్ క్రికెటర్ల నుంచి మొదలుకొని క్రికెట్ అనలిస్టుల వరకు ఏవేవో రీజన్స్ చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు. ఈ మ్యాచ్​లో టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ ఒకటి ప్రధాన కారణమని చాలా మంది చెబుతున్నారు. మంచి టచ్​లో ఉన్న హిట్​మ్యాన్ లాస్ట్ వరకు ఆడితే భారత్ సులువుగా 300 ప్లస్ స్కోరు చేసేదని.. ఆసీస్​కు అంత భారీ స్కోరు ఛేజ్ చేయడం కష్టమయ్యేదని అంటున్నారు. మాక్స్​వెల్​ బౌలింగ్​లో రోహిత్ ఆ షాట్ కొట్టకపోయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని చెబుతున్నారు.

ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్​ అందుకుంది హిట్​మ్యాన్ క్యాచ్ కాదని.. భారత్ నుంచి మ్యాచ్ అని కామెంట్స్ చేస్తున్నారు. మన టీమ్ మంచి దూకుడు మీద ఉన్న టైమ్​లో బౌలింగ్​కు వచ్చిన మ్యాక్స్​వెల్​పై అటాకింగ్​కు దిగాడు రోహిత్ శర్మ. అప్పటికే అతడి ఓవర్​లో 10 రన్స్ వచ్చినా మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. హిట్​మ్యాన్ కొట్టిన బాల్​ను 30 యార్డ్ సర్కిల్ నుంచి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ అందుకున్నాడు హెడ్. అయితే ఈ క్యాచ్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. రోహిత్​ క్యాచ్​ను హెడ్ సరిగ్గా అందుకోలేదని.. క్యాచ్ పట్టే టైమ్​లో బాల్ నేలకు తాకిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

రోహిత్ శర్మ క్యాచ్​కు సంబంధించి పలు ఫొటోలు సోషల్ మీడియాలో ఫైరల్ అవుతున్నాయి. హెడ్ క్యాచ్ మిస్ చేసినా అంపైర్ భారత్ కెప్టెన్​ను ఔట్​గా ప్రకటించాడని వాదనలు వస్తున్నాయి. అయితే ఈ వివాదానికి తెరదించుతూ ఐసీసీ రియల్ ఫుటేజీని రిలీజ్ చేసింది. ఇందులో రోహిత్ క్యాచ్​ను హెడ్ సరిగ్గానే అందుకున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎలా వ్యాప్తి అవుతోందో ఈ ఘటన ప్రూవ్ చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి.. రోహిత్ క్యాచ్ ఘటనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బాధలో ఉన్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! రోహిత్, కోహ్లీకి మరో ఛాన్స్!

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి