iDreamPost

Mohemmad Siraj: సిరాజ్ స్వింగ్ కు సౌత్ ఆఫ్రికా సలామ్.. ఏకంగా 6 వికెట్స్!

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ విజృభింస్తున్నాడు. అతను వేసే బంతులకు ప్రొటీస్ జట్టు విలవిల్లాడుతోంది.

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్ సిరాజ్ విజృభింస్తున్నాడు. అతను వేసే బంతులకు ప్రొటీస్ జట్టు విలవిల్లాడుతోంది.

Mohemmad Siraj: సిరాజ్ స్వింగ్ కు సౌత్ ఆఫ్రికా సలామ్.. ఏకంగా 6 వికెట్స్!

న్యూల్యాండ్స్ స్టేడియంలో మహ్మద్ సిరాజ్ విజృంభణతో ప్రొటీస్ జట్టు పల్టీలు కొడుతోంది. ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగులు చేయలేక అల్లాడుతోంది. సౌత్ ఆఫ్రికా జట్టును మరీ గల్లీ క్రికెటర్లను చేసి హైదరాబాద్ సిరాజ్ చెలరేగిపోతున్నాడు. అతడు వేసే బంతులను ఆడలేక సఫారీలు కంగారు పడిపోతున్నారు. పరుగుల సంగతి తర్వాత ముందు డిఫెండ్ చేయగలిగితే చాలేమే అని పరిస్థితికి చేరిపోయారు. భారీ లక్ష్యాలు వదిలేయండి.. గౌరవప్రదమైన స్కోరును సాధింస్తే అదే పదివేలు అనుకునే స్థితిలో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కనిపిస్తోంది. సిరాజ్ దెబ్బకు బ్యాటర్స్ వచ్చిన దారినే పెలియన్ కు చేరుతున్నారు. ఇప్పటివరకు ప్రొటీస్ టీమ్ 8 వికెట్లు కోల్పోతే వాటిలో 6 వికెట్లు సిరాజ్ కే దక్కాయి.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని సౌత్ ఆఫ్రికా జట్టు పెద్ద తప్పే చేసింది. ఆ విషయం వాళ్లకి కూడా ఇప్పుడే తెలిసి వచ్చినట్లైంది. ఎందుకంటే మహ్మద్ సిరాజ్ స్వింగ్ ఆడాలంటే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఆట మొదలు పెట్టినప్పటి నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. మధ్యలో కాసేపు పార్టనర్ షిప్ ఏర్పడుతోంది అనుకునే సమయంలో మల్లీ సిరాజ్ బ్యాటర్ ని పెవిలియన్ కు పంపుతున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టును మరీ పసికూన చేసి సిరాజ్ బౌలింగ్ చేస్తుంటే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి టెస్టులో ఎదురైన ఘోర పరాభావానికి సిరాజ్ సరైన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అంటూ హైదరాబాదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

siraj got 6 wickets

నిజానికి సిరాజ్ బంతి విసురుతుంటే ఆడియన్స్ మాత్రమే కాదు.. సఫారీ బ్యాటర్లు కూడా అలా చూస్తూ ఉండిపోతున్నారు. కేవలం 9 ఓవర్లలోనే 6 వికెట్లు పడగొట్టాడు. ఇది టెస్టు మ్యాచులా కాకుండా చూసేందుకు టీ20 మ్యాచ్ లా అనిపిస్తోంది. ఎందుకంటే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్ కు చేరుతున్నాడు. ఒక్క ప్లేయర్ కూడా ఇప్పటివరకు 20 పరుగులు చేయలేదు. ఒక్క కైల్ వెరైన్ మాత్రమే 30 బంతులు ఎదుర్కొన్నాడు. మిగిలిన వాళ్లంతా కేవలం 20 బంతుల్లోనే అవుట్ అయిపోయారు. ప్రస్తుతం సిరాజ్ అనగానే అందరూ అన్ స్టాపబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ సమురీ చూస్తే.. మొత్తం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి సౌత్ ఆఫ్రికా జట్టు 48 పరుగులు చేసింది. మార్కరమ్(2), ఎల్గర్(4), డే జోర్జీ(2), స్టబ్స్(3), బెడింగామ్(12), కైల్ వెరైన్(15), జాన్సన్(0), కేశవ్ మహరాజ్(3) పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం క్రీజులో రబాడా, బర్గర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. సిరాజ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. జాస్ప్రిత్ బుమ్రా, ముఖేశ్ లకు చెరో వికెట్ దక్కింది. మరి.. మహ్మద్ సిరాజ్ విజృంభణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి