iDreamPost

Rohit Sharma: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్ శర్మ!

కొన్ని కొన్ని సందర్భాల్లో ఓడిపోవడమే మంచిది అంటూ సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. మరి ఈ వ్యాఖ్యలు రోహిత్ ఎందుకు? ఏ సందర్భంలో చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని కొన్ని సందర్భాల్లో ఓడిపోవడమే మంచిది అంటూ సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ. మరి ఈ వ్యాఖ్యలు రోహిత్ ఎందుకు? ఏ సందర్భంలో చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Rohit Sharma: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన రోహిత్ శర్మ!

సౌతాఫ్రికా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు తొలి టెస్ట్ లో గట్టి షాక్ తగిలింది. భారత దిగ్గజ కెప్టెన్ లకు సాధ్యం కానీ రికార్డును తన పేరిట లిఖించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. కానీ అతడి ఆశలకు తొలిరోజే గండి కొట్టారు సఫారీ బౌలర్లు. మెరుపు వేగంతో బంతులు సంధిస్తూ.. భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓవైపు డెడ్లీ బౌన్సర్లతో పాటుగా, మరోవైపు వికెట్లు పడగొడుతూ టీమిండియా బ్యాట్స్ మెన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఓడిపోవడమే మంచిది అంటూ మ్యాచ్ కు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఈ వ్యాఖ్యలు రోహిత్ ఎందుకు? ఏ సందర్భంలో చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సెంచూరియన్ వేదికగా మెుదలైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. ప్రోటీస్ పేస్ బౌలింగ్ ముందు నిలవలేక టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ ను ముందుగానే ముగించారు. అడుగడుగున కఠిన సవాళ్లు ఎదురౌతున్న సెంచూరియన్ పిచ్ పై టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఒక్కడే అసాధారణ పోరాటం చేస్తున్నాడు. ప్రోటీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. 70 పరుగులతో అజేయంగా నిలిచాడు రాహుల్. ఇదిలా ఉండగా.. మ్యాచ్ కు ముందు టాస్ వేసే సమయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

rohit sharma shocking comments

“నిజయితీగా చెప్పాలంటే నేను కచ్చితంగా అనుకోలేదు, టాస్ పడితే బ్యాటింగ్ తీసుకోవాలో? లేదా బౌలింగ్ తీసుకోవాలో? అయితే ఇలాంటి కొన్ని సందర్భాల్లో టాస్ ఓడిపోవడమే మంచిదని నా అభిప్రాయం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సౌతాఫ్రికా పిచ్ లు పేస్ కు విపరీతంగా అనుకూలిస్తాయి. అదీకాక అక్కడ వర్షం పడుతోంది. దీంతో టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలో అర్ధం కాలేదన్న సందర్భంలో ఈ కామెంట్స్ చేశాడు హిట్ మ్యాన్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది టీమిండియా. జట్టులో కేఎల్ రాహుల్(70*) ఒక్కడే అసాధారణ పోరాటం కనబరుస్తున్నాడు. మిగతా బ్యాటర్లలో జైస్వాల్(17), రోహిత్(5), గిల్(2), కోహ్లీ(38), శ్రేయస్ అయ్యర్(31), అశ్విన్(8), శార్దూల్(24), బుమ్రా(1) పరుగులు చేశారు. ఇక సఫారీ బౌలర్లలో సీనియర్ స్టార్ బౌలర్ కగిసో రబాడ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. మరి టాస్ పై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి