iDreamPost

మటన్‌తో పోటీ పడుతున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

ఆదివారం వస్తే చాలు చికెన్ తెచ్చుకుని కడుపు నింపుకుంటాయి సామాన్య కుటుంబాలు. అలాంటి కుటుంబాలకు బ్యాడ్ న్యూస్. మటన్ ధరతో పోటీపడుతోంది చికెన్ ధర..

ఆదివారం వస్తే చాలు చికెన్ తెచ్చుకుని కడుపు నింపుకుంటాయి సామాన్య కుటుంబాలు. అలాంటి కుటుంబాలకు బ్యాడ్ న్యూస్. మటన్ ధరతో పోటీపడుతోంది చికెన్ ధర..

మటన్‌తో పోటీ పడుతున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

నాన్ వెజ్ ప్రియులు చికెన్‌తో చేసిన పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కంచెంలో చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఆదివారం వస్తే చాలు..ఇంట్లో కోడి కూర లేకపోతే అన్నం తిన్నట్టే ఉండదు. ఎప్పుడు చికెన్ తినాలిపించినా.. వెంటనే చికెన్ బిర్యానీ అయినా ఆర్డర్ చేసుకుని తింటుంటారు. ఇక ఇంట్లో మహిళలు అయితే చికెన్‌తో కొత్త కొత్త వంటలు చేసి భర్తకు, పిల్లలకు పెడుతుంటారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అంటూ యూట్యూబ్‌లో వెతికి మరీ వండుతుంటారు. కోడి మాంసంతో వండిన కూరలంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ ఎమోషన్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు వీటి ధరలు కూడా మటన్ రేటుతో పోటీ పడుతున్నాయి అనడంలో అతిశయోక్తి కాదు.

సాధారణంగా ఎండాకాలం వస్తే చికెన్, ఎగ్ ధరలు తగ్గుతుంటాయి. కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. గత రెండు వారాల నుండి చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మార్చి 15 కన్నా ముందు చికెన్ ధర రూ. 220లోపు ఉండగా.. గుడ్ ఫ్రైడే ముగిసి, ఈస్టర్, రంజాన్ మాసం ప్రారంభం అయిన నాటి నుండి దీని ధక అమాంతం పెరిగిపోయింది. ఉపవాస దినాలు ముగియడంతో పాటు రంజాన్ మాసంలో ఎక్కువగా ఇష్టపడే హలీమ్ చికెన్ ఫ్లేవర్ తయారు చేస్తున్న నేపథ్యంలో కిలో చికెన్ ధరకు రెక్కలొచ్చాయి. ఏకంగా రూ. 300కు చేరింది. తెలంగాణలో కోడి మాంసం ధరలను పరిశీలిస్తే.. స్కిల్ లెస్ కేజీ చికెన్ ధర రూ. 300గా ఉంది. దీంతో షాక్ తింటున్నారు మాంసాహార ప్రియులు. ఇక స్కిన్ అయితే రూ. 260-280 పలుకుతోంది.

దీంతో అహ నా పెళ్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని కట్టుకుని తిన్నట్లుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. బయట తిరుగుతున్న కోళ్లను చూసి నోరు సప్పరించుకోవాల్సిందే.  మొన్నటి వరకు రూ. 220 లోపే పలికిన ధరలు.. ఇప్పుడు రూ. 300లకు పలుకుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇలా ఉంటే.. రెస్టారెంట్లలో కూడా చికెన్‌తో చేసిన వంటకాల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. లేదా గతం కన్నా ముక్కలు తగ్గించేస్తున్న పరిస్థితి. అయితే ఈ చికెన్ ధరలు పెరగడానికి ఎండలు అని సమాచారం. ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో మనుషులే తపతపలాడిపోతున్నారు. ఇక కోళ్లు అయితే చనిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గిపోయింది. అదే సమయంలో మార్కెట్ డిమాండ్ పెరిగింది. ఎండాకాలం ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉండనుందని మార్కెట్ నిపుణుల అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి