iDreamPost

ఇతడి ఖాతాలోకి 6 రోజుల్లో రూ. 6 కోట్లు! అదృష్టం కాదు, అంతకుమించి!

ఉన్నపళంగా కొంత మందికి తమ ఖాతాల్లోకి కోట్లు వచ్చి పడిపోతూ ఉంటాయి. అది అదృష్టమనుకునేలోపు ఇది సాంకేతిక సమస్య అని, రాంగ్ నంబర్ కొట్టడం వల్ల వచ్చాయని బ్యాంకు అధికారులు, ఇతరుల నుండి ఫోన్లు వస్తుంటాయి. అవి రికవరీ అవుతూ ఉంటాయి. కానీ ఇతగాడికి మాత్రం..

ఉన్నపళంగా కొంత మందికి తమ ఖాతాల్లోకి కోట్లు వచ్చి పడిపోతూ ఉంటాయి. అది అదృష్టమనుకునేలోపు ఇది సాంకేతిక సమస్య అని, రాంగ్ నంబర్ కొట్టడం వల్ల వచ్చాయని బ్యాంకు అధికారులు, ఇతరుల నుండి ఫోన్లు వస్తుంటాయి. అవి రికవరీ అవుతూ ఉంటాయి. కానీ ఇతగాడికి మాత్రం..

ఇతడి  ఖాతాలోకి 6 రోజుల్లో రూ. 6 కోట్లు! అదృష్టం కాదు, అంతకుమించి!

బ్యాంకు లావాదేవీల్లో కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. నగదు జమ చేసేటప్పుడు కానీ, మరొకరికి ట్రాన్స్ ఫర్ చేస్తున్న సమయంలో నంబర్ తప్పు పడితే.. మరొకరి ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోతుంటాయి. కొన్ని సార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా భారీ మొత్తంలో ఖాతాదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోయిన దాఖలాలు ఉన్నాయి. కొంత మంది అంత డబ్బు చూసేసరికి అయోమయానికి, గందరగోళానికి గురి అవుతుంటారు. తీద్దామనుకునే లోపు బ్యాంకు యాజమాన్యం వాటిని రికవరీ చేసుకుంటూ ఉంటుంది. అలాగే నగదు జమ అయిన ఖాతా దారులకు వివరణ ఇస్తుంది. ఒక సారి లేదా ఒక రోజు నగదు పడుతున్నాయంటే పొరపాటు అనుకోవచ్చు కానీ, ఆరు రోజుల పాటు.. రోజుకు కోటీ రూపాయలు చొప్పున గుర్తు తెలియని బ్యాంక్ అకౌంట్ నుండి మనీ పడుతున్నాయంటే.. ఏమై ఉంటుందబ్బా.

అదే సందేహం వచ్చింది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఓ వ్యక్తికి. జిల్లాలోని భుజ్ పురా ప్రాంతానికి చెందిన అస్లాం ఖాతాలో ఆరు రోజుల్లో రూ. 6 కోట్లు డిపాజిట్ అయ్యే సరికి తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేసిన అతడు.. తానంత అదృష్టవంతుడు లేడని భావించి..ఆ మొత్తాన్ని తన రెండో ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అయితే రోజూ కోటి రూపాయిలు పడుతుండటంతో భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించి..ఆ నగదు ఎక్కడి నుండి జమ అవుతున్నాయో విచారించాలంటూ వేడుకున్నాడు. అస్లాం ఫిర్యాదుతో అతడి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు పోలీసులు. అస్లాం 2010 నుండి ఓ మెడికల్ స్టోర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల నవంబర్ 11 నుండి తన ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో రూ. కోటి రూపాయలు జమ అయ్యాయి.

అలా ఆరు రోజులు.. రోజుకూ కోటి రూపాయల చొప్పున జమ అవ్వడంతో.. తన రెండవ అకౌంట్ యూకోలోకి బదిలీకి చేసుకున్నాడు. అయితే అంత డబ్బు రోజు వచ్చి పడుతుండటంతో భయపడ్డ అస్లాం.. ఈ సమస్య పరిష్కరించాలంటూ బ్యాంకు అధికారులు చుట్టూ తిరగ్గా.. ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక కూడా నగదు జమ అవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అందులో తన సొంత డబ్బు కూడా ఉందని అన్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 13 వరకు అస్లాం ఖాతాలోకి రూ. 4.78 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత కూడా నగదు జమ అవుతూనే ఉందని సుమారు ఆరు కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి