iDreamPost

సినిమాగా ఇళయరాజా కథ

సినిమాగా ఇళయరాజా కథ

తమిళ్ లోనే కాదు తెలుగు మలయాళం కన్నడలోనూ తన అద్భుతమైన సంగీతంతో కోట్లాది అభిమానులను సంపాదించుకుని ఇప్పటికీ రారాజులా వెలిగిపోతున్న ఇళయరాజా నిజజీవిత కథ త్వరలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్నీ స్వయానా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా వెల్లడించడం విశేషం. ఆ ఆలోచన ఉందని త్వరలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

హీరోగా ఎవరు నటిస్తారు అనే దాని గురించి క్లారిటీ లేదు. ధనుష్ తో చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దర్శకుడు ఎవరో కాదు యువనే దీనికి కెప్టెన్ గా వ్యవహరిస్తారు. తండ్రి కథను తన కన్నా గొప్పగా ఎవరు అర్థం చేసుకుంటారనే తీసుకుంటారనే ఉద్దేశంతో దర్శకుడిగా మారాలని డిసైడ్ అయినట్టు ఉన్నారు. గత రెండేళ్ళుగా అన్ని పరిశ్రమలలోనూ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. మహానటి సక్సెస్ తో ఇది పీక్స్ కు వెళ్లిపోయింది. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ మెన్ ఇలా దేశంలో ప్రముఖుల కథలన్నీ వెండితెరపైకి వస్తున్నాయి. 

ఇప్పుడు ఇళయరాజా కథ అంటే ఖచ్చితంగా సంగీత ప్రేమికులు ఉత్సుకతతో ఎదురు చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గా వెయ్యి పైగా సినిమాలు చేసిన రాజా పేరుని పోస్టర్ లో చూసి హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా జనం సినిమాలకు వెళ్ళేవారని అప్పట్లో మాట్లాడుకునే వారు. చెన్నైలో చిన్న హార్మోనియం పెట్టెతో ప్రయాణం ప్రారంభించిన ఇళయరాజా లాంటి స్ఫూర్తి కథలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నట్టు మన ఘంటసాల మీద కూడా సినిమా తీశారు కాని దాని విడుదలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి