iDreamPost

వీడియో: గ్రౌండ్ లో పాక్ బ్యాటర్ విచిత్ర ప్రవర్తన.. దెయ్యాలతో చిట్ చాట్ అంటున్న నెటిజన్లు!

  • Author Soma Sekhar Published - 04:48 PM, Wed - 25 October 23

తాజాగా జరిగిన ఆఫ్గాన్-పాక్ మ్యాచ్ లో పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వరల్డ్ కప్ 2023లో వరుసగా సంచలనాలు నమోదవుతున్నాయి. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పెద్ద జట్లకు షాకిస్తూ.. దూసుకెళ్తున్నాయి చిన్నజట్లు. ఇక ఈ మెగాటోర్నీలో కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ సంఘటనలు ప్రేక్షకులకు ఫుల్ మజాను అందిస్తున్నాయి. తాజాగా జరిగిన ఆఫ్గాన్-పాక్ మ్యాచ్ లో పాక్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇఫ్తికర్ అహ్మద్ దెయ్యాలతో చిట్ చాట్ చేస్తున్నాడా? ఏంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్థాన్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ షాకింగ్ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 25 ఓవర్లు ముగిసిన తర్వాత ప్లేయర్లు మాట్లాడుకోవడానికి దగ్గరికి వస్తున్నారు. అందులో షాహీన్ షా అఫ్రిదీ, రిజ్వాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ లు ఉన్నారు. కాగా.. షాదాబ్ ఖాన్ తో అఫ్రిదీ, రిజ్వాన్ లు మాట్లాడుతుండగా.. వారిద్దరి వెనకాలే ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ ఎవ్వరితో సంబంధం లేనట్లుగా తనతో తానే గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు.

అతడి పక్కన ఎవరూ లేకపోవడం, ఎవరినో చూసి మాట్లాడుతున్నట్లుగా తల తిప్పడం చేశాడు ఇఫ్తికర్. ఈ టైమ్ లో అతడు ఎవరినో బెదిరిస్తున్నట్లుగా కనిపించాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో.. అతడు ఎవరితో మాట్లాడాడు? ఆత్మలు, దెయ్యాలతో ఏమైనా చిట్ చాట్ చేస్తున్నాడా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ మ్యాచ్ లో 282 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఆఫ్ఘాన్. మరి ఇఫ్తికర్ అహ్మద్ ఇలా తనలో తానే మాట్లాడుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి