iDreamPost

HYDలోని ఈ 3 ఏరియాల్లో స్థలం కొంటే.. లక్షల్లో లాభం! మంచి ఛాన్స్!

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆ మూడు ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. భవిష్యత్తులో లక్షల్లో లాభాలు అందుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఏరియాలు ఏవంటే?

హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆ మూడు ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. భవిష్యత్తులో లక్షల్లో లాభాలు అందుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఏరియాలు ఏవంటే?

HYDలోని ఈ 3 ఏరియాల్లో స్థలం కొంటే..  లక్షల్లో లాభం! మంచి ఛాన్స్!

హైదరాబాద్ లో స్థలం కొనడం అంటే సామాన్యులకు అయ్యే పని కాదు. మినిమమ్ సెలబ్రిటీలు అయితేనే గానీ స్థలం కొనలేని పరిస్థితి. అయితే కొంతమంది తెలివైనవారు పలానా ఏరియా డెవలప్ అవుతుంది అని తెలుసుకుని తెలివిగా ముందుగానే ఆ ఏరియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కట్ చేస్తే కొన్నాళ్ళకు ల్యాండ్ రేట్లు పెరిగిపోయి సెలబ్రిటీలు అయిపోతారు. మరి మీరు కూడా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలి అని అనుకుంటే కనుక ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది.

ఆదిభట్ల

హైదరాబాద్ లో అమంగల్, ఆదిభట్ల, అల్వాల్, బాచుపల్లి, మహేశ్వరం, ఇస్నాపూర్, కడ్తల్, కంది, కొల్లూరు ఇలా చాలా ప్రాంతాలు పెట్టుబడికి స్వర్గధామంగా ఉన్నాయి. అయితే వీటిలో ప్రధానంగా మూడు ఏరియాలు మిడిల్ క్లాస్ వారి పాలిట స్వర్గధామం అని చెప్పవచ్చు. వాటిలో ఆదిభట్ల, శంకర్ పల్లి, ఘట్కేసర్ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువ. మధ్యతరగతి వారు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ ఏరియాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పదేళ్లలో ఆదిభట్లలో ల్యాండ్ రేట్ల వృద్ధి రేటు చూసుకుంటే 238 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం అంటే 2014లో చదరపు అడుగు 600 పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పుడు అది 2200 అయ్యింది. ఐదేళ్ళలో ల్యాండ్ రేట్లు చూసుకుంటే 51 శాతంగా ఉంది. అంటే 2019లో చదరపు అడుగు 1450 పెట్టి కొనుగోలు చేస్తే అది 2200కి పెరిగింది.

మూడేళ్ళలో 25 శాతం పెరిగింది. అంటే 2021లో 1800 పెట్టి కొనుగోలు చేస్తే 2200 అయ్యింది. ఐటీ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఆదిభట్ల ప్రసిద్ధి చెందింది. పలు మల్టీనేషనల్ కంపెనీలు, టెక్ పార్క్స్ ఈ ఏరియాలో ఉండడం చేత ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్, ప్రధాన హైవేకి దగ్గరగా ఉన్న కారణంగా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ కి ఆకర్షణీయమైన ప్రాంతంగా ఉంది. ఐటీ, ఐటీఎస్ కంపెనీలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బడా సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఐటీ కన్సల్టింగ్ వంటి సర్వీసులని అందిస్తున్నాయి. ఇంకా చాలా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఆదిభట్ల నుంచి హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒకటి నిర్మించాలన్న ప్రపోజల్ ఉంది. ఐటీ సెక్టార్ పెరుగుదల, కొత్త విద్యా సంస్థల స్థాపన వంటి వాటి వల్ల ఆదిభట్లలో రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్స్ కి డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కి తగ్గట్టు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఈ ఆదిభట్లలో పెట్టుబడులు పెడుతున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తర్వాత ఆ రేంజ్ లో ఆదిభట్ల డెవలప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 2 వేల నుంచి 2800 రేంజ్ లో ఉంది. అంటే ఒక గజం స్థలం కొనాలంటే 18 వేల నుంచి 25 వేల వరకూ అవుతుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో గజం స్థలం ఎంతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఫ్యూచర్ లో ఆదిభట్ల కూడా మరో హైటెక్ సిటీగా మారుతుందని అంటున్నారు.

ఘట్కేసర్

ఇక ఆదిభట్ల తర్వాత హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు చెప్పుకోతగ్గ ప్రాంతాలుగా ఘట్కేసర్, శంకర్ పల్లి ఏరియాలు చెప్పుకోవచ్చు. ఐటీ కంపెనీలను విస్తరించేందుకు ఇన్వెస్టర్లు ఘట్కేసర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఘట్కేసర్ ప్రాంతంలో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే ల్యాండ్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇన్ఫోసిస్ కి ఈ ప్రాంతంలో 450 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని ఇంకా విస్తరించాలని చూస్తుంది. అలానే రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ కి కూడా 150 ఎకరాల ల్యాండ్ ఉంది. ఐబీఎం, అసెంచర్, జెన్ ప్యాక్ట్ వంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఘట్కేసర్ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ఈ కారణంగా డిమాండ్ పెరిగి ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఘట్కేసర్ కూడా పెట్టుబడికి మంచి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘట్కేసర్ లో చదరపు అడుగు ధర రూ. 1450గా ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తక్కువ ఇన్వెస్ట్ మెంట్ తోనే ఎక్కువ లాభాలను అందుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

శంకర్ పల్లి

ఇక ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయడానికి మరో అనువైన ప్రాంతం శంకర్ పల్లి. హైదరాబాద్ కు దగ్గర్లో పాపులారిటీ పొందిన ఏరియాల్లో శంకర్ పల్లి ఒకటి. ఓఆర్ఆర్ కు ఐటీకారిడార్ కు దగ్గర్లో ఉండడం శంకర్ పల్లికి బాగా కలిసొచ్చింది. ఐటీ కంపెనీలు, ఇతర ఎంఎన్సీ కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, రియాల్టర్లు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ పల్లి ఏరియాలో చదరపు అడుగు ధర రూ. 1950 ఉంది. గడిచిన ఐదేళ్లలో 50శాతం వృద్ధి సాధించింది. 2019లో స్క్వేర్ ఫీట్ ధర రూ. 1650 ఉండగా అది ప్రస్తుతం 1950కి పెరిగింది. శంకర్ పల్లిలో రిసార్టులు, ఫాంహౌస్ లు నిర్మాణాలు ఎక్కువగానే ఉన్నాయి. మరో వైపు గృహ నిర్మాణ ప్రాజెక్టులు కూడా ఈ ఏరియాలో నిర్మాణాలు చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణాలతో ఇప్పుడు స్థలాలపై ఇన్వెస్ట్ చేసేవారికి భవిష్యత్తులో లక్షల్లో లాభాలు రావడం ఖాయమని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి