iDreamPost

మీ ఇంట్లో ఉప్మా తినట్లేదా? మిగిలిపోతుందా?.. అయితే ఇలా చేయండి

మీ ఇంట్లో ఉప్మా తినట్లేదా? మిగిలిపోతుందా?.. అయితే ఇలా చేయండి

మనం తొందరగా తయారుచేసే టిఫిన్లలలో ఉప్మా ఒకటి. కొంతమంది దీన్ని ఇష్టంగా తింటే మరికొంతమంది తినరు. కొంచెం రవ్వతోనే ఎక్కువ ఉప్మా తయారయి ఇంటిల్లిపాదికి వస్తుంది. ఉప్మా వేడిగా ఉంటేనే చాలా మంది తింటారు, చల్లారితే ఉప్మా తినడానికి అంతగా ఆసక్తి చూపించారు. ఉప్మా సరిగ్గా తినక మిగిలిపోతే, చల్లారిపోతే ఏం చేయాలో తెలియక పడేస్తూ ఉంటాము. కానీ మిగిలిన ఉప్మాతో ఈ కొత్త వంటకం తయారుచేస్తే అందరూ ఇష్టంగా తింటారు.

చల్లారిపోయిన, మిగిలిపోయిన ఉప్మాని వేస్ట్ అవకుండా ఉప్మా బోండా తయారు చేసుకోవచ్చు. ఉప్మా బోండాని ఎలా చేయాలో తెలుసుకోండి. ఉప్మా బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు :-

*ఉప్మా
*శనగపిండి 3/4 కప్పు
*బియ్యంపిండి కొద్దిగా
*వాము చిటికెడు
*పచ్చిమిర్చి ముక్కలు కొన్ని
*కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా
*నూనె వేయించుకోవడానికి తగినంత
*ఉప్పు, కారం, నీళ్లు తగినంత
*బేకింగ్ సోడా చిటికెడు

ఉప్మా బొండం తయారుచేసే విధానం:-

ముందుగా ఉప్మాని కొన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, కారం అన్నిటిని నీళ్లు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. వాముని దంచి ఆ మిశ్రమంలో కలపాలి మరియు బేకింగ్ సోడా చిటికెడు కలపాలి దీనివల్ల బొండాలు చక్కగా వస్తాయి. కరివేపాకు, కొత్తిమీర కూడా ఈ మిశ్రమంలో కలపాలి. ఒక పాన్ లో నూనెను వేడి చేయాలి. చిన్న చిన్న ఉండలుగ చేసిన ఉప్మా ఉండలను ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు కలిపిన మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేయించుకోవాలి. మనం బజ్జిలు తయారు చేసే విధంగా ఈ ఉప్మా బోండాలను తయారు చేయొచ్చు. ఈ ఉప్మా బోండాలకు సాస్ లేదా చట్నీ కలిపి తినొచ్చు. దీంతో ఈ ఉప్మా బోండాలను అందరూ ఇష్టంగా తింటారు, ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి