iDreamPost

క్రికెట్ లోకి ICC కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి!

  • Author Soma Sekhar Published - 06:49 PM, Mon - 11 December 23

కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్ ను డిసెంబర్ 12 నుంచి అమల్లోకి తేనుంది.

కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్ ను డిసెంబర్ 12 నుంచి అమల్లోకి తేనుంది.

  • Author Soma Sekhar Published - 06:49 PM, Mon - 11 December 23
క్రికెట్ లోకి ICC కొత్త రూల్.. రేపటి నుంచే అమల్లోకి!

పరిస్థితులను బట్టి, పరిమిత ఓవర్ల క్రికెట్ ను కాపాడుకునేందుకు ముందడుగులు వేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). అందులో భాగంగానే కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ.. వన్డే, టీ20 ఫార్మాట్స్ లో వేగం పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 నుంచి విండీస్-ఇంగ్లాండ్ మధ్య ప్రారంభం అయ్యే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఈ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి క్రికెట్ నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలే వన్డే, టీ20 పురుషుల ఫార్మాట్స్ లో ‘స్టాప్ క్లాక్’ రూల్ ను కొత్తగా తీసుకొచ్చిన సంగతి విదితమే. అయితే ఈ రూల్ ను డిసెంబర్ 12 నుంచి పొట్టి ఫార్మాట్ లో అమల్లోకి తేనుంది. వెస్టిండీస్-ఇంగ్లాండ్ ల మధ్య 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆరంభం కానుంది. ఈ సిరీస్ నుంచే ‘స్టాప్ క్లాక్’ రూల్ ను ఆచరణలోకి రానుందని ఐసీసీ వెల్లడించింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సమయం ఎక్కువ వృథా అవుతున్న కారణంగా ఈ రూల్ ను తెచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది.

ఈ క్రమంలోనే వైట్ బాల్ ఫార్మాట్ లో మరింత వేగం పెంచేందుకు ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకన్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైమ్ గా ఫిక్స్ చేసింది. ఈ టైమ్ లోనే బౌలర్ ఓవర్ వేసిన తర్వాత మరో బౌలర్ మరుసటి ఓవర్ స్టార్ట్ చేయాలి. మ్యాచ్ లో రెండు సార్లు ఈ రూల్ బ్రేక్ చేస్తే.. జట్టుకు 5 పరుగులు పెనాల్టీ కింద విధిస్తారు. ఈ రన్స్ బ్యాటింగ్ చేసే జట్టుకు యాడ్ అవుతాయి. ఈ నయా రూల్ వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కొత్త రూల్ ను నవంబర్ 21న అహ్మదాబాద్ లో జరిగిన బోర్డ్ సమావేశంలో ఐసీసీ దీని అమలుకు నిర్ణయం తీసుకుంది. మరి ఈ ఐసీసీ తెచ్చిన ఈ నయా రూల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి