iDreamPost

ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్లకు బిగ్ షాకిచ్చిన ICC!

  • Author Soma Sekhar Published - 05:16 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 05:16 PM, Thu - 3 August 23
ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్లకు బిగ్ షాకిచ్చిన ICC!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 సైకిల్ ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ తో ప్రారంభం అయ్యింది. ఇప్పటికే భారత్-వెస్టిండీస్, పాకిస్థాన్-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ లు జరిగాయి. ఈ మూడు సిరీస్ ల తర్వాత WTC పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. ఇక యాషెస్ సిరీస్ ను 2-2తో సమం కావడంతో.. ఇంగ్లాండ్, ఆసీస్ జట్లకు సమానంగా పాయింట్లు లభించాయి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ఇంగ్లాండ్-ఆసీస్ జట్లకు బిగ్ షాక్ ఇచ్చింది. హోరాహోరిగా సాగిన ఈ సిరీస్ లో ఇరుజట్లు అద్భుతంగా పోరాడాయి. దీంతో సిరీస్ సమం అయ్యింది. మరి యాషెస్ జట్లకు ఐసీసీ ఇచ్చిన షాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ను ఇరు జట్లు 2-2తో సమంగా గెలిచాయి. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ హోరాహోరిగా సాగింది. తొలి టెస్టు నుంచి చివరి టెస్టు దాక నువ్వా.. నేనా.. అన్నట్లుగా మ్యాచ్ లు జరిగాయి. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ విజయం సాధించగా.. అద్భుతంగా పుంజుకున్న ఇంగ్లాండ్ మూడో, ఐదో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. ఇక నాలుగో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. కాగా.. యాషెస్ సిరీస్ తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 సైకిల్ ప్రారంభం అయ్యింది. ఈ సైకిల్ లో టాప్-2లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ సైకిల్ లో ఆడే ప్రతీ మ్యాచ్, ప్రతీ పాయింట్ కీలకమే.

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లకు భారీ షాక్ ఇచ్చింది ఐసీసీ. యాషెస్ సిరీస్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు జట్లకు WTC పాయింట్లలో భారీ కోత విధించింది. ఆస్ట్రేలియా టీమ్ కు నాలుగో టెస్ట్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా 10 పాయింట్లు కోత విధించింది ఐసీసీ. ఇక ఇంగ్లాండ్ పరిస్థితి మరీ ఘోరంగా తయ్యారు అయ్యింది. నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో.. మెుత్తం 19 WTC పాయింట్లు కట్ చేసింది ఐసీసీ. పాయింట్ల కోతతో పాటుగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ కోత పడింది. అయితే ఐసీసీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పలువురు క్రికెటర్లు. ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా అసంతృప్తి వ్యక్తపరిచాడు. WTC లో ఫైనల్ కు చేరాలంటే ఈ పాయింట్లే కీలకం. దాంతో ఇరు జట్లు పరిస్థితి దారుణంగా తయ్యారైంది. మరి ఐసీసీ తాాజాగా తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ప్లేయర్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి