iDreamPost

ఐఏఎస్‌లకేం తెలుసు? అంతా మీకే తెలుసు బాబు గారు!!

ఐఏఎస్‌లకేం తెలుసు? అంతా మీకే తెలుసు బాబు గారు!!

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటన తర్వాత మొదట ఆవేదనలు వెలుబుచ్చి.. ఆపై విశాఖకు ప్రత్యేక విమానంలో వెళ్తానంటూ కేంద్ర పెద్దలతో సంప్రదింపులతో రోజంతా వృథా చేసుకున్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎట్టకేలం శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఇంట్లో నుంచి ఎంపిక చేసుకున్న మీడియాకు లైవ్‌లో మాట్లాడుతూ.. తనకు మాత్రమే సొంతమైన జ్ఞాన గుళికలను వదిలారు. మహా ప్రసాదం అనుకుంటూ ఆ మీడియా ప్రసారాలు చేసుకుంది.

‘‘నేను గనుక ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఉంటేనా’’ అంటూ మొదలుపెట్టి అటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను, ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రిని తిట్టిపోశారు. అన్నిట్లోనూ హైలెట్‌ ఏంటంటే.. తనకు తెలియని విషయాలు ఈ భూ ప్రపంచంలో ఎవరికీ తెలియవు అన్నంత రేంజ్‌లో రెచ్చిపోవడం. ‘‘40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్‌ అంటే తెలియదు.. ఈ ఐఏఎస్‌లకు ఏం తెలుసు?. వాళ్లకు సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఏముంటుంది? వారి ప్రతిభ గురించి నాకు తెలియదా?’’ అంటూ దుయ్యబట్టారు. అంతేకదా మరి ఏళ్ల తరబడి ఎన్నో రకాల పుస్తకాలు చదివి, దేశంలో కోట్ల మందితో పోటీ పడి, ప్రిలిమ్స్‌ అని, మెయిన్స్‌ అని, ఇంటర్వ్యూ అని ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఐఏఎస్‌లుగా సెలెక్ట్‌ అయిన వారికి ఏం తెలివి ఉంటుంది. కుట్రలతో సొంత మామకు వెన్నుపోటు పొడిచి షార్ట్‌కట్‌లో సీఎం కుర్చీని, పార్టీని కొట్టేసిన చంద్రబాబు తెలివితో ఐఏఎస్‌లు ఏం పోటీ ఇవ్వగలరు. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారేమో.!!!

Also Read:నిన్న హామీ ,నేడు అమలు.. సూపర్ ముఖ్యమంత్రి గారు

అంతటితో ఆగకుండా ఈ ఘటన తర్వాత రాత్రంతా నిద్ర పట్టలేదని, నిన్నంతా నిపుణులతో ఈ ఘటనపై అధ్యయనం చేశానని చెప్పుకొచ్చారు. అయితే తాను చేసిన ఆ అధ్యయనంలో ఏం తేలిందో మాత్రం చెప్పలేదు. ప్రస్తుత సీఎం జగన్‌ విశాఖ వెళ్లి ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో వెళ్లలేదని, నేను గనుక విశాఖలో ఉండి ఉంటే ఫ్యాక్టరీలోకి వెళ్లి ఉండి వాడినని బీరాలు పలికారు. అయితే ఆ ఫ్యాక్టరీలోకి తాను వెళ్లి ఏం చేసేవారో మాత్రం చెప్పలేదు.

ఆ తర్వాత మరింత దిగజారి.. ప్రమాద మృతులకు కోటి రూపాయలు ఏం సరిపోతాయి? అసలు డబ్బులు ఇమ్మని ఎవరు అడిగారు అంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. బహుశా తాను రొటీన్‌ ఫార్మాలిటీ ప్రకారం ఎక్స్‌గ్రేసియా ఇంత ఇవ్వాలని డిమాండ్‌ చేయకుండానే సీఎం వైఎస్‌ జగన్‌ కోటి రూపాయలు ప్రకటించడంతో చంద్రబాబు అహం దెబ్బతిన్నట్లుంది. అందుకే డబ్బులు ఇవ్వమని ఎవరు అడిగారు అంటూ మాట్లాడారు. లేదా తాను అధికారంలో ఉండగా ఏ ప్రమాద బాధితులకూ 5 లక్షలు కూడా ఇవ్వని విషయం గుర్తుకు వచ్చి ముంచుకు వచ్చిన సిగ్గును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై విమర్శల రాయి విసిరాడేమో?

Also Read:గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు రాజీనామా చేశారు ?

గ్యాస్‌ లీకేజీ ప్రమాదం తర్వాత బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవను కోట్లాది మంది ప్రశంసిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అక్కసు తీరడం లేదు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి