iDreamPost

ఏపీలో కీలక ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు

ఏపీలో కీలక ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు

ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం టీటీడీ ఈవోగా కొనసాగుతున్నారు. ఆయన సీఎంవోలో నియమితులైనప్పటికీ, టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను బదిలీ చేశారు. సీసీఎల్ఏగా జి.సాయిప్రసాద్ ను బదిలీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ లు కూడా బదిలీ అయ్యారు.

మరో పక్క రవాణా శాఖ కమిషనర్ గా ఎంటీ కృష్ణబాబు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు, క్రీడలు యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులు ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఇప్పటిదాకా పని చేస్తూ ఉండగా ఆయనను రిలీవ్ చేశారు. అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

తాత్కాలిక డీజీపీగా నియమితులైన కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఏసీబీ డీజీగా బదిలీ చేసింది ప్రభుత్వం. అయితే ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విజిలెన్సు ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగానూ ఆయను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి