iDreamPost

అంబానీ, అదానీలేనా మేమూ కొంటాం.. అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొన్న HYD మహిళ

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అంబానీ, అదానీల కంటే ముందే లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అంబానీ, అదానీలేనా మేమూ కొంటాం అని నిరూపించింది. కోట్లు విలువ చేసే లోటస్ కారును సొంతం చేసుకుంది ఆ మహిళ.

హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అంబానీ, అదానీల కంటే ముందే లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అంబానీ, అదానీలేనా మేమూ కొంటాం అని నిరూపించింది. కోట్లు విలువ చేసే లోటస్ కారును సొంతం చేసుకుంది ఆ మహిళ.

అంబానీ, అదానీలేనా మేమూ కొంటాం.. అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొన్న HYD మహిళ

భారతదేశ వ్యాపార దిగ్గజాలైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుబేరులుగా పేరుగాంచిన వీరు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. వీరు నివసించే ఇల్లు, తిరిగే కార్లు అత్యంత లగ్జరీగా ఉంటాయి. విదేశాల్లొ తయారయ్యే అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ అంబానీ, అదానీల కంటే ముందే లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అంబానీ, అదానీలేనా మేమూ కొంటాం అని నిరూపించింది. కోట్లు విలువ చేసే లోటస్ కారును సొంతం చేసుకుంది ఆ మహిళ.

అంబానీ, అదానీలే కాకుండా పలురంగాలకు చెందిన ప్రముఖులు లగ్జరీ కార్లను కొంటుంటారు. అయితే వీళ్లెవరూ కొనకముందే హైదరాబాద్ కు చెందిన హర్షిక రావు అనే మహిళ లగ్జరీ కారైన లోటస్ కారును కొనుగోలు చేసింది. ఇటీవలే రూ. 2.55 కోట్లు విలువ చేసే బ్రిటీష్ ఆటోమొబైల్ తయారీదారు లోటస్ కార్స్ కు చెందిన లోటస్ ఎలెట్రి ఎలక్రిక్ కారును కొనుగోలు చేసింది. ధరతో పాటే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడం ఈ కారు సొంతం. కాగా ఈ కారు కొన్న మొట్ట మొదటి భారతీయురాలిగా హర్షిక రావు రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

కాగా లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు భారత్ మర్కెట్ లో గతేడాది విడుదలయ్యింది. లోటస్ ఎలెట్రే ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్. భారతదేశంలో లోటస్ ఎలెట్రె ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.55 కోట్లుగా నిర్ణయించారు. ఎలెట్రే అండ్ ఎలెట్రే ఎస్ మోడల్స్ 603 హార్స్ పవర్ అందించే డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ను కలిగి 600 కిమీ రేంజ్ అందిస్తాయి. ఎలెట్రే ఆర్ మోడల్ 905 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపలి భాగంలో 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోల్డబుల్ 15.1 అంగుళాల ల్యాండ్‌స్కేప్ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది 5జీ కనెక్టివిటీ, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Car Crazy India® (@carcrazy.india)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి