iDreamPost

కుటుంబ వివాదం.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబానికి కోర్టు నోటీసులు

కుటుంబ వివాదం.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబానికి కోర్టు నోటీసులు

నేతి మిఠాయిల తయారీలో, వ్యాపారంలో పేరొందిన ప్రముఖ పుల్లారెడ్డి స్వీట్స్ కుటుంబ వివాదం కోర్టుకు చేరింది. పుల్లారెడ్డి మనువడు ఏక్ నాథ్ రెడ్డి తన భార్య ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోనే బంధించి హింసిస్తున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోనే ఉంచి, బయటికి వచ్చే వీలు లేకుండా ఏక్ నాథ్ రెడ్డి అడ్డుగోడ కట్టి పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసుల సహాయంతో బయటికి వచ్చిన ప్రజ్ఞారెడ్డి తన తండ్రితో కలిసి తనపై జరుగుతున్న హింసను గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజాగా ప్రజ్ఞారెడ్డి మొబైల్ కోర్టును ఆశ్రయించింది. రాఘవరెడ్డి కుటుంబం తనపై గృహ హింసకు పాల్పడుతున్నారంటూ ప్రజ్ఞా హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తనను హింసించారని పేర్కొంటూ పిటిషన్ వేసింది. తనపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఫొటోలను కూడా ప్రజ్ఞా కోర్టుకు సమర్పించింది. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు.. బాధితురాలికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడికి నోటీసులు జారీ చేసింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి