iDreamPost

హైదరాబాద్ లో దంపతుల పాడు పనులు! గత 6 నెలలుగా ఇంట్లోనే..!

jఈ మధ్యకాలంలో కొందరు ఈజీ మనీ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, చట్టాన్ని ఉల్లింఘించి తప్పు పనులతో డబ్బును సంపాదిస్తేనే అసలు సమస్య. కానీ, హైదరాబాద్ లోని ఓ భార్యాభర్తలు ఇదే పని చేశారు. గత 6 నెలలుగా వీరి ఇంటిని వేదికగా చేసుకుని అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి గలీజ్ పనులకు తెర లేపారు.

ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు చెమటోడ్చి డబ్బులు సంపాదించకుండా ఈజీ మనీ కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎవరికీ నష్టం లేకుండా చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, చట్టాన్ని ఉల్లింఘించి తప్పు పనులతో డబ్బును సంపాదిస్తేనే అసలు సమస్య. కానీ, హైదరాబాద్ లోని ఓ దంపతులు ఇదే పని చేశారు. గత 6 నెలలుగా వీరి ఇంటిని వేదికగా చేసుకుని అమ్మాయిలను, మహిళలను తీసుకొచ్చి గలీజ్ పనులకు తెర లేపారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వారి ఇంటిపై దాడులు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లో చాలా కాలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా చాలా మంది వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు అనుమానం ఉన్న సెలూన్లపై, అద్దె ఇంట్లపై దాడులు చేస్తూ వ్యభిచార నిర్వాహకులతో పాటు విటులను అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పాడు పనులు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనే నగరంలో మరొకటి వెలుగు చూసింది. అసలు విషయం ఏంటంటే? అల్వాల్ వెంకటాపురం పరిధిలోని మారుతి నగర్ లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

ఇతడు కష్టపడకుండ డబ్బులు సంపాదించాలని వ్యభిచారం నిర్వహించాలని అనుకున్నాడు. అయితే ఈ బిజెనెస్ చేసేందుకు తన భార్యతో కూడా చేతులు కలిపాడు. ఇందులో భాగంగానే గత 6 నెలలుగా ఈ దంపతులు ఇంట్లోనే ఈ గలీజ్ దందాకు తెర లేపారు. తాజాగా కూడా ఇద్దరు మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహించారు. దీన్ని పసిగట్టిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక విటుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దంపతులను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి