iDreamPost

తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం ఛైర్ గేమ్.. అడ్డు పడుతుంది ఎవరు?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం ఛైర్ గేమ్ ప్రారంభమైంది. అందరూ ఊహించనట్లు గానే కాంగ్రెస్ లో ఆనవాయితీ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ కి సీఎం ఎంపిక తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం ఛైర్ గేమ్ ప్రారంభమైంది. అందరూ ఊహించనట్లు గానే కాంగ్రెస్ లో ఆనవాయితీ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ కి సీఎం ఎంపిక తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో  సీఎం ఛైర్ గేమ్.. అడ్డు పడుతుంది ఎవరు?

నెల రోజుపాటు సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఈ కురుక్షేత్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. మేజార్టీ కావాల్సిన సంఖ్యను చేరుకోవడంతో.. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. అయితే ఎన్నికలు గెలిచే వరకు కాంగ్రెస్ ఒక యుద్ధం చేస్తే.. గెలిచిన తరువాత మరో యుద్ధం చేయాల్సి వచ్చింది. అందరూ భావించినట్లే తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం ఛైర్ గేమ్ మొదలైంది. ఈ రేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ లు ఉన్నారు. ప్రధానంగా రేవంత్, భట్టి విక్రమార్క పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్  సీఎం పేరును ప్రకటించకుండా ఇంత ఆలస్యానికి కారణం ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రులను మార్చే పార్టీ అని అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో వస్తుంది. తాజాగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 64, మిత్రపక్షం సీపీఐ 1 స్థానంలో గెలిచాయి. దాదాపు పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

అయితే అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నో యుద్దాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతం జరిగాయి. చివరకు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్ హస్తగతం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మరో యుద్ధం మొదలైంది. అదే సీఎం పదవి నాకంటే నాకు అని నేతలు ముందుకు వస్తున్నారు. సీఎం సీటు కోసం సీనియర్లు, టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయా పడుతున్నారు.

కాంగ్రెస్ లో సీఎం పదవిని ఆశించే ఆశావహుల ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రధానంగా కొందరు మాత్రమే పోటీలో ఉన్నారు. సీఎం కూర్చి కోసం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు తనకు సీఎం కుర్చీ దక్కుతుందంటే తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలా హస్తం పార్టీలో సీఎం సీటు కోసం సుదీర్ఘ చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయా సేకరణ కూడా పార్టీ హైకమాండ్ జరిపింది. వాస్తవానికి సోమవారం రాత్రి 8.00 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. అయితే  ఆ కార్యక్రమం వాయిదా పడింది.

అందరూ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. అయితే ఆ దిశగా అడుగులు ఎక్కడ పడలేదు. రేవంత్ ను సీఎంగా చేయడం సీనియర్లకు ఇష్టం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకున్న తమను కాదని, కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇవ్వడంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ కు కాకుండా సీనియర్లలో ఎవరికి ఇచ్చిన తమకు సమంతమే అనే విధానంలో కొందరు నేతలు ఉన్నట్లు రాజకీయా విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఇక సీఎం రేసులో ఉన్న మరో నేత మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. ప్రధానంగా రేవంత్, భట్టి మధ్యనే  సీఎం కూర్చి గేమ్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. సీఎంగా భట్టి పేరును కొందరు ప్రతిపాదిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వారులో ఎక్కువగా రేవంత్ వర్గం వారు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కొత్త వచ్చిన ఎమ్మెల్యేల్లో చాలా మంది రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని, వారందరూ భట్టి పేరును వ్యతిరేకిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే రేవంత్ రెడ్డిను సీఎంగా ప్రకటిస్తే సీనియర్ల స్పందన ఎలా ఉంటుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది.

కాబట్టి ఈ సారికి రేవంత్ ను ఆపి..సీనియర్లో ఒకరి సీఎం సీటు అప్పగించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా సీఎం ఛైర్ గేమ్ లో  సీనియర్ల, రేవంత్ వర్గానికి మధ్యనే ప్రధాన వార్ నడుస్తోందని టాక్. భట్టి, రేవంత్ వర్గాలు పరస్పరం అడ్డుపతున్నాయనే ప్రచారం సాగుతోంది. మరి.. సీఎం రేసులో ఎవరు విజేతలో తెలియాలంటే మరికాస్త సమయం ఆగాల్సి ఉంది. మరి.. కాంగ్రెస్ లో జరుగుతున్న సీఎం ఛైర్ ఫైట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి