iDreamPost

ఆన్ లైన్ షాపింగ్ పేరిట కొత్త మోసం.. ఈ చిన్న పొరపాటు చేస్తే మీ ఖాతా ఖాళీ!

మార్కెట్ లోకి రోజుకో కొత్త టెక్నాలజీ ఎలా అయితే వస్తోందో.. సైబర్ మోసం కూడా అలాగే వస్తోంది. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగు చూసింది. దీని గురించి తెలియకపోతే ఖాతాలు ఖాళీ చేసేస్తారు.

మార్కెట్ లోకి రోజుకో కొత్త టెక్నాలజీ ఎలా అయితే వస్తోందో.. సైబర్ మోసం కూడా అలాగే వస్తోంది. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగు చూసింది. దీని గురించి తెలియకపోతే ఖాతాలు ఖాళీ చేసేస్తారు.

ఆన్ లైన్ షాపింగ్ పేరిట కొత్త మోసం.. ఈ చిన్న పొరపాటు చేస్తే మీ ఖాతా ఖాళీ!

ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్ అయిపోయింది. సూది కావాలన్నా, సబ్బు కావాలన్నా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. అలాగే కొరియర్ సర్వీసులు కూడా చాలానే వచ్చాయి. మీకు ఏ వస్తువు కావాలాన్నా గడప దాటకుండానే ఇంటికి తెప్పించుకోవచ్చు. అయితే ఈ సర్వీసుల పేరుతో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. కాస్త ఆదమరుపుగా ఉన్నా కూడా ఖాతాలను ఖాళీ చేసేస్తారు. అందుకే ఆన్ లైన్ షాపింగ్స్ చేసే వాళ్లే టార్గెట్ గా ఇప్పుడు కొత్త మోసం ఒకటి వచ్చింది. ఈ పొరపాటు చేస్తే ఒక్క ఖాతా కాదు.. మీకున్న అన్ని ఖాతాలు ఖాళీ అయిపోతాయి.

టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. అయితే సాకేంతికతతో పాటు.. మోసాలు కూడా అలాగే పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు కూడా రూటు మార్చారు. ఇప్పుడు నేరుగా ఫోన్ చేసే ప్రజలను మోసం చేయడం ప్రారంభించారు. ఇప్పటికే మార్కెట్ లో చాలానే మోసాలు చూశాం. ఇటీవల వీడియో కాల్ మోసం కూడా వెలుగు చూసింది. ఇప్పుడు కొరియర్ స్కామ్ ఒకటి మార్కెట్ ని షేక్ చేస్తోంది. ఈ స్కామ్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు అందరూ ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. వారికి దొరికిన నంబర్లకు ఫోన్ చేస్తారు. ఆ తర్వాత సార్ మీకు కొరియర్ వచ్చింది. మా డెలివరీ బాయ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అంటగా అని అడుగుతాడు.

అవునా నేను చూసుకోలేదు అని మీరు సమాధానం చెబుతారు. ఐటమ్ ఉంచాలా? రిటర్న్ చేయమంటారా? అంటూ దబాయిస్తాడు. ఎవరైనా వెంటనే అలా చేయద్దు మాకు ఆ ఐటమ్ కావాలి అని చెప్తారు. వాళ్లు వెంటనే మా డెలివరీ బాయ్ కి కాల్ చేయండి. అతనకి అడ్రస్ చెప్పండి అంటూ మీమ్మల్ని ట్రాప్ చేస్తాడు. మీరు వెంటనే అతని నెంబర్ నాకు చెప్పండి అంటారు. అందుకు ఆ సైబర్ నేరగాడు.. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి డయల్ చేయండి అంటూ ఒక నంబర్ చెప్తాడు. *401* టైప్ చేసి తాను చెప్పిన నంబర్ ఎంటర్ చేయమని చెప్తాడు. అలా అయితేనే కాల్ వెళ్తుంది అని నమ్మబలుకుతాడు. మీరు గనుక పొరపాటున అలా చేస్తే మీ పని అయిపోయినట్లే. ఎందుకంటే అలా చేస్తే మీ కాల్స్ అన్నీ అతను చెప్పిన నంబర్ కు ఫార్వార్డ్ అవుతాయి.

దీనిని కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ అంటారు. అంతేకాకుండా మెసేజ్ లు, ఓటీపీలు కూడా ఆ నంబర్ కే వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఖాతాలో ఉన్న డబ్బును కూడా వాళ్లు ఎంచక్కా డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఓటీపీ కూడా ఫార్వార్డ్ అవుతుంది కాబట్టి. అందుకే మీకు ఎవరైనా కాల్ చేసి కొరియర్ వెనక్కి పంపేయమంటారా? మా డెలివరీ బాయ్ కి కాల్ చేయండి అంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చేసింది రియల్ వాళ్లా? సైబర్ నేరగాళ్లా? అనే విషయం మీకు క్లారిటీ ఉండాలి. ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం మంచిదే.. కానీ, కొరియర్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలపై మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ విషయాన్ని మీ బంధువులు, కుటుంబసభ్యులకు కూడా తెలియజేసి వారిని కూడా అలర్ట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి