iDreamPost

రోడ్డు, రైలు, విమాన మార్గం ద్వారా అయోధ్యకు ఎలా చేరుకోవాలి? పూర్తి వివరాలు

మీరు అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నారా? చారిత్రక ఘట్టాన్ని కనులారా వీక్షించాలని భావిస్తున్నారా? అయితే హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గం ద్వారా ఇలా అయోధ్యకు చేరుకోండి.

మీరు అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకుంటున్నారా? చారిత్రక ఘట్టాన్ని కనులారా వీక్షించాలని భావిస్తున్నారా? అయితే హైదరాబాద్ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గం ద్వారా ఇలా అయోధ్యకు చేరుకోండి.

రోడ్డు, రైలు, విమాన మార్గం ద్వారా అయోధ్యకు ఎలా చేరుకోవాలి? పూర్తి వివరాలు

శ్రీరాముని జన్మ స్థలమైన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సపమయం ఆసన్నమైంది. శతాబ్ధాల నుంచి ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతోంది. అయోధ్యలో కొలువుదీరనున్న కోదండ రాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు రామ భక్తులు. ఈ నెల(జనవరి) 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. రామ భక్తులు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రామ భక్తులు ఇప్పటికే కొందరు అయోధ్యకు పయనమయ్యారు. మరి ఆ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు అయోధ్యకు ఎలా చేరుకోవాలి. రోడ్డు, రైలు, విమాన మార్గం ద్వారా అయోధ్యకు చేరుకునే వీలుందా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరాముడు కొలువుదీరనున్న అయోధ్యకు తెలంగాణ నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్, శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్స్ ద్వారా అయోధ్యకు వెళ్లొచ్చు.

విమానాల ద్వారా:

  • విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరు గా అయోధ్యకు వెళ్లేందుకు ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ సంఖ్యలో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. దీంతో చాలా మంది శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 140 కి.మీల దూరంలో ఉన్న అయోధ్యకు 3 నుంచి 4 గంటల్లో బస్సు లేదా ట్రైన్ లో ప్రయాణం చేసి అయోధ్యను సందర్శించొచ్చు.

రైలు మార్గం:

  • రైళ్ల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు వెళ్లేందుకు ట్రైన్ కనెక్టివిటీ ఉంది. ఏ ప్రాంతం నుంచైన ట్రైన్ లో ప్రయాణించి నేరుగా అయోధ్య రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఒక వేళ న్యూ ఢిల్లీ నుంచి వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైనే జర్నీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే సికింద్రా బాద్ నుంచి ట్రైన్ లో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు ట్రైన్, బస్సుల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్ కు ట్రైన్ వెళ్తోంది. ఈ ట్రైన్ లో మొత్తం 30 గంటల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాల్లో బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి వారం శుక్ర, ఆది,సోమ వారాల్లో రైలు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

రోడ్డు మార్గాన:

  • అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తుల కోసం హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. దాదాపు 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒక టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి సొంత వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగ్ పూర్, జబల్ పూర్, ప్రయాగ్ రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే మొత్తం 1305 కి. మీలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక అయోధ్యకు వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. అలాగే విమానాల ద్వారా వెళ్లే వారి కోసం పలు విమానయాన సంస్థలు స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు రెడీ అవుతున్నాయి. మరి మీరు కూడా రామ మందిరాన్ని సందర్శించాలనుకుంటే పైన తెలిపిన రవాణా మార్గాల ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి