iDreamPost

Social Media Trolls : ఆన్ లైన్ వెక్కిరింతలకు గొళ్ళెం వేసేదెలా

Social Media Trolls : ఆన్ లైన్ వెక్కిరింతలకు గొళ్ళెం వేసేదెలా

ఇటీవలే సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ మీద టీవీ ఛానల్స్ లోనూ పెద్ద చర్చే జరిగింది. మంచు ఫ్యామిలీని టార్గెట్ చేయడం పట్ల విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని డిలీట్ చేయకపోతే పది కోట్లకు నష్టపరిహారం దావా వేస్తానని ఆయా ప్లాట్ ఫార్మ్స్ కు లీగల్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే.సరే సినిమా రన్ ఎలా ఉంది, కలెక్షన్లు ఎంత వచ్చాయి అనేది పక్కనపెడితే ఈ స్థాయిలో ఒక సీనియర్ హీరోకు జరగడం మాత్రం ఎవరూ ఊహించనిది. దానికి కారణాలు ఏవైనా పబ్లిక్ లో ఇది రకరకాల అర్థాలను తీసుకెళ్తోంది. దీనికి తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం కవరేజ్ ఇవ్వడంతో రీచ్ ఎక్కడికో వెళ్తోంది.

ప్రాక్టికల్ గా ఆలోచించి చూస్తే ఈ ట్రోల్స్ ఆపడం అనేది జరగని పని. ఎవరు చేస్తున్నారో మహా అయితే పదుల సంఖ్యలో ఆచూకీ కనుక్కోవచ్చు. కానీ ట్విట్టర్ లో లక్షల ఫేక్ ఐడిలతో దీన్నో నిత్య ప్రహసనంగా మార్చిన వాళ్ళను పట్టుకోవడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. ఎవడిదీ అసలు పేరు ఉండదు. ఫోన్ నెంబర్లు పెట్టరు. హీరోలు లేదా హీరోయిన్ల ఫోటోలను డిపిలో పెట్టుకుని ఆన్ లైన్ ట్రోలింగ్ కి దారులు వేసుకుంటారు. ఇదంతా ఏళ్ళ తరబడి జరుగుతున్నదే. అన్ని భాషల్లో ఫ్యాన్స్ మధ్య వార్ ని సృష్టిస్తున్నదే. కాకపోతే ఇప్పుడీ ట్రోల్స్ ఏకంగా సినిమా వసూళ్లను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయనేది కొందరి వాదన.

వీటిని ఆపగలమా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వాలకు వీటి మీద పూర్తి నియంత్రణ లేదు. పైగా సినిమాల మ్యాటర్లు జాతీయ భద్రత అంత సీరియస్ ఇష్యూలు కాదు. అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా పూర్తిస్థాయి యాక్షన్ తీసుకోలేదు. కాకపోతే నెటిజెన్లు తమకు తాము మరీ హద్దులు దాటుతున్నామేమో అని చెక్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇవి భవిష్యత్తులో వికృత రూపం దాల్చి తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు. ఆపడం కొంత మేరకు సాధ్యమే కానీ పూర్తిగా రూపుమాపడం మాత్రం అసాధ్యం. 4జి లేని రోజుల్లోనే బాగుండేది. పరిమిత నెట్ తో టెక్నాలజి వాడకం తక్కువగా ఉండి ఇంత నష్టం జరిగేది కాదు

Also Read :  Rana Daggubati : మా హీరోని తక్కువ చేశారని అభిమానుల ఫైర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి