iDreamPost

హాంకాంగ్‌ పై పట్టు బిగిస్తున్న చైనా

హాంకాంగ్‌ పై పట్టు బిగిస్తున్న చైనా

హాంకాంగ్ పై చైనా పట్టుబిస్తుంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా ఆందోళనలు‌ పెరిగాయి. మరోవైపు దీనిపై అమెరికా కాలు దువ్వుతుంది.

హాంకాంగ్‌ జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(చైనా పార్లమెంటు)లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు 2,878 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. అయితే మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా హాంకాంగ్ లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ బిల్లు ద్వారా నగర స్వయం ప్రతిపత్తికి వచ్చే ప్రమాదం ఏమీ లేదని హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించింది.

ఈ చట్టానికి అసవరమైన విధానాలను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తయారు చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు రానున్న కొద్ది వారాల్లో తెలిసే అవకాశం ఉందని, సెప్టెంబర్‌ నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలనే యోచనలో చైనా ఉన్నట్లు తెలుస్తోంది.

హాంకాంగ్‌ నగరంలో వేర్పాటు వాదం, అణచివేత, ఉగ్రవాదం మరియు విదేశీ జోక్యాన్ని పరిష్కరించే విధంగా ఈ చట్టం ఉంటుందని చైనా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రణాళికలను గతవారం బీజింగ్‌లో విడుదల చేశారు.

దీంతో పాటుగా చైనా జాతీయ గీతాన్ని అవమానపరిస్తే తీసుకునే చర్యలకు సంబంధించిన బిల్లుపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరిగింది. జాతీయ భద్రతా బిల్లు ద్వారా నగర స్వయం ప్రతిపత్తికి వచ్చే ప్రమాదం ఏమీ లేదని హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించింది.

తాజా జాతీయ భద్రతా బిల్లు హాంకాంగ్‌లో నిరసనలను రేకెత్తించింది. ఈ రెండు బిల్లును ప్రతిపాదనపై ఆందోళన నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న కొంతమంది ఒక షాపింగ్‌మాల్‌ వద్ద గుమిగూడారు. అయితే అంతకు ముందు రోజే వేలాది మంది రోడ్డుపైకి రావడంతో పోలీసులు దాదాపు 360 మందిని అరెస్టు చేశారు. దీంతో తాజాగా ఆందోళనలు పునరావృతం కాలేదు.

నేరస్తులను చైనాకు తరలించే అంశానికి సంబంధించి గత ఏడాది హాంకాంగ్‌లో పెద్ద యెత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
చైనాపై పైచేయి సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ హాంకాంగ్‌ అంశాన్ని వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే.

భద్రతా బిల్లును చైనా ఆమోదించిన నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియమన్‌ నుంచి పలు వ్యాఖ్యలు వచ్చాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ అమెరికా చట్టం ప్రకారం తమ దేశం హాంకాంగ్‌ను ఇక ఎంతో కాలం ప్రత్యేకంగా చూడబోదని అన్నారు. హాంకాంగ్‌ స్వేచ్ఛను అణగతొక్కడమే ఈ బిల్లు ఉద్దేశమని కాంగ్రెస్‌లో ఆయన ఆరోపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి