iDreamPost

ఓటిటిలో RRRకు విదేశీయుల ప్రశంసలు

ఓటిటిలో RRRకు విదేశీయుల ప్రశంసలు

థియేటర్ల నుంచి దాదాపుగా సెలవు తీసుకుని ఇరవై రోజుల క్రితం ఓటిటిలో వచ్చేసిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఆన్ లైన్ వేదికగా కొత్త సంచలనాలకు తెరతీసింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ వెర్షన్ ని దేశవిదేశీయులు ఎగబడి చూస్తున్నారు. మరోవైపు అమెరికాలో ఎన్కొర్ పేరుతో వేస్తున్న స్పెషల్ ప్రీమియర్లు రెండు నెలల తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఇప్పటికే 1100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టిన ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పుడు స్మార్ట్ స్క్రీన్ పై సృష్టిస్తున్న రికార్డులు అంచనాలకు మించి అనేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఫారినర్స్ పెడుతున్న ట్వీట్లు చూస్తుంటే మతులు పోవడం ఖాయం.

ఇది ఏ ఇతర విదేశీ భాషలో డబ్బింగ్ కాలేదు. కేవలం హిందీ మాత్రమే వారికి అందుబాటులో ఉంది. అయినా కూడా సబ్ టైటిల్స్ సహాయంతో చూసి గొప్ప అనుభూతిని పొందుతున్నారు. డాక్టర్ స్ట్రేంజ్ సినిమాకు పని చేసిన రచయిత సి రాబర్ట్ కార్గిల్ సైతం ఇంత గొప్ప చిత్రాన్ని నేనెప్పుడూ చూడలేదని ట్వీట్ చేయడం అన్నిటి కన్నా పెద్ద సర్ప్రైజ్. ఇతనే కాదు వెరిఫైడ్ హ్యాండిల్స్ ఉన్న వందలాది విదేశీయులు ఆర్ఆర్ఆర్ గురించి ఇలాగే పొగుడుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రోలు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. రాజమౌళి పనితనాన్ని పొగుడుతున్నారు.

ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు. ఇంకా జపాన్ చైనాలో ఆర్ఆర్ఆర్ విడుదల కాలేదు. అక్కడ రిలీజ్ చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరించడం వల్లే ఎక్కువ ఆలస్యం జరుగుతోంది. ఒకవేళ అక్కడా వచ్చేస్తే ఈజీగా రెండు వేల కోట్లను దాటే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కన్నా వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసిన కెజిఎఫ్ 2 కూడా అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పటికీ దానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ లేదన్న మాట వాస్తవం. బాహుబలి గురించి కూడా ఇంత మాట్లాడుకోలేదు. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ ఓటిటి గురించి ఈ రేంజ్ స్పందన మాత్రం ఎవరూ ఉహించనిది. ఇంకొంత కాలం ఈ జోరు కొనసాగేలా ఉంది.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Friends came over last night to initiate me into the cult of RRR (RISE ROAR REVOLT) and I&#39;m here to report I am now fully, truly, deeply a member. This is the craziest, most sincere, weirdest blockbuster I&#39;ve ever seen. I&#39;m pretty sure Jess and I are watching it again this week. <a href=”https://t.co/WFpOAKq8VG”>pic.twitter.com/WFpOAKq8VG</a></p>&mdash; C. Robert Cargill (@Massawyrm) <a href=”https://twitter.com/Massawyrm/status/1533843127580217348?ref_src=twsrc%5Etfw”>June 6, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి