iDreamPost

Holidays: విద్యార్థులకు, ఉద్యోగులకు పండగే పండగ.. ఏప్రిల్లో భారీగా సెలవులు.. ఎన్ని రోజులంటే

  • Published Apr 02, 2024 | 9:31 AMUpdated Apr 02, 2024 | 9:31 AM

విద్యార్థులు, ఉద్యోగులకు పండగ లాంటి వార్త. ఏప్రిల్లో భారీగా సెలవులు రానున్నాయి. ఎన్ని రోజులంటే...

విద్యార్థులు, ఉద్యోగులకు పండగ లాంటి వార్త. ఏప్రిల్లో భారీగా సెలవులు రానున్నాయి. ఎన్ని రోజులంటే...

  • Published Apr 02, 2024 | 9:31 AMUpdated Apr 02, 2024 | 9:31 AM
Holidays: విద్యార్థులకు, ఉద్యోగులకు పండగే పండగ.. ఏప్రిల్లో భారీగా సెలవులు.. ఎన్ని రోజులంటే

సాధారణంగా ఏప్రిల్ నెల అంటేనే సెలవులు. విద్యార్థులకు ఈ నెల నుంచే వేసవి కాలం సెలవులు ఇస్తారు. గతంలో అయితే ఏప్రిల్ 15 నుంచి కచ్చితంగా సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా అవి ఆలస్యం అవుతున్నాయి. ఈసారి సుమారుగా ఏప్రిల్ నెలఖారు నుంచి వేసవి సెలవులు ఉండనున్నాయి. ఈ నెల మొత్త విద్యాసంస్థలు పని చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్లో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. మరి ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి అంటే..

ఏప్రిల్ నెలలో మొత్తం కలిపి దాదాపు 10 రోజుల‌కు పైగా స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు రానున్నాయి. ఎందుకంటే ఈ నెలలోనే ముఖ్య‌మైన‌ రంజాన్, శ్రీరామనవమి, ఉగాది, అంబేడ్కర్ జయంతి లాంటి పండ‌గ‌లు ఉన్నాయి. అలాగే ఈ నెల‌లో నాలుగు ఆదివారాలు ( ఏప్రిల్ 7, 14, 21, 28) ఉన్నాయి. సాధారణంగా విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదివారాలతో పాటుగా, రెండో, నాలుగవ శనివారాలు సెలవులు ఉంటాయి. ప్రైవేటు సంస్థలకైతే కేవలం ఆదివారాలు మాత్రమే హాలీడే ఉంటుంది.

ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరసుగా సెలవులు రానున్నాయి. అందుకు కారణం ఉగాది, రంజాన్, శ్రీరామనవమితో పాటుగా రెండో శనివారం, ఆదివారం కూడా ఉండటంతో.. వరుసగా సెలవులు రానున్నాయి.

సెలవులు వివరాలు ఇలా ఉన్నాయి

  1. ఏప్రిల్ 5వ తేదీ బాబు జగ్జీవన్ రాం జయంతి
  2. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం
  3. ఏప్రిల్ 9వ తేదీ (మంగళవారం) ఉగాది తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీలు ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఉంటుంది.
  4. ఏప్రిల్ 10వ తేదీ రంజాన్ (బుధ‌వారం) ఈ రోజు అన్ని స్కూల్స్‌, కాలేజీలు ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఉంటుంది.
  5. ఏప్రిల్ 13వ తేదీ రెండో శ‌నివారం
  6. ఏప్రిల్, 14 ఆదివారం
  7. ఏప్రిల్ 17వ తేదీన‌ (బుధ‌వారం) శ్రీరామనవమి పండ‌గ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు ఆఫీస్‌ల‌కు హాలిడే ఉంటుంది.
  8. ఏప్రిల్ 21 ఆదివారం
  9. ఏప్రిల్ 27 నాల్గో శ‌నివారం
  10. ఏప్రిల్, 28 ఆదివారం

అలాగే ఇదే నెల‌లో స్కూల్స్ విద్యార్థుల‌కు మ‌రో శుభవార్త ఏంటంటే.. వేస‌వి సెల‌వులు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 24వ తేదీ స్కూల్స్ సమ్మర్ హాలీడేస్ మొదలవుతాయి. ఈ ఏడాది స్కూల్స్‌కి దాదాపు 50 రోజులు పాటువేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ జూనియర్ కళాశాలల‌కు ఇంటర్మీడియట్ వేసవి సెలవులను మార్చి 31వ తేదీ నుంచి మే 31, 2024 ఇచ్చిన విష‌యం తెల్సిందే.

బ్యాంక్ లకు కూడా భారీగానే సెల‌వులు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్‌ మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి