iDreamPost

లీఫ్ ఇయర్ ఏర్పాటు వెనుక ఆసక్తికర చరిత్ర

లీఫ్ ఇయర్ ఏర్పాటు వెనుక ఆసక్తికర చరిత్ర

ఇవాళ ఫిబ్రవరి 29వ తారీఖు. అయితే ప్రతీ ఫిబ్రవరికీ 28 రోజులే ఉంటాయి.. కానీ 4 సంవత్సరాల కోసారి ఎక్స్‌ట్రా డే ఎందుకు వస్తుంది.. అదీ ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుంది.. ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది.. ఈ లీప్ ఇయర్ లో ఈ అదనంగా ఒకరోజు ఎందుకు కలుస్తోంది.? అంటే దీనికి కొన్ని సైంటిఫిక్ కారణాలున్నాయి.

ప్రతీ యేటా ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. అదే లీప్ ఇయర్ లో మాత్రం ఫిబ్రవరి నెలలో 29వ తేదీ కూడా ఉంటుంది.. ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండడంతో చాలా ఉపయోగాలున్నాయట.. ఏడాది ఆయుష్షులో మనం అదనంగా మరో రోజు జీవించినట్టేనట.. అయితే అసలు ఈ ఎక్స్‌ట్రా రోజు ఎందుకొస్తుందో తెలుసుకుందాం.. మనకు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని, ఇలా ఒక రౌండ్ తిరిగడానికి 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, 46 సెకన్లు పడుతుందని అందరికీ తెలుసు.. అయితే సంత్సరానికి 365 రోజులతోపాటు మరో పావురోజు పడుతుంది. ఈ పావురోజును ఒకరోజుగా పరిగణించలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో గల నాలుగు పావు రోజుల్ని కలిపి ఒక రోజుగా మార్చి లీప్ ఇయర్‌ అయిన ఫిబ్రవరి నెలలో కలుపుతున్నారు. అలా ఫిబ్రవరికి ఎప్పుడూ 28వస్తూ నాలుగేళ్లకోసారి 29వ రోజు వస్తోంది.

అయితే ఆ కలిపే రోజు కేవలం ఫిబ్రవరిలోనే ఎందుకు కలుపుతున్నారు.? అంటే ఇదే సందేహం చాలామందికి వస్తుంది. మిగతా నెలలకంటే ఫిబ్రవరిలో తక్కువగా 28 రోజులే ఉంటాయి కాబట్టి కలుపుతున్నారని కొందరు చెప్తుంటారు.. కానీ ఇది అవాస్తవం.. ఫిబ్రవరిలో నెలలోనే ఎందుకు కలుపుతున్నారన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది..

క్రీస్తు పూర్వం గ్రీస్ లు, రోమన్లు క్యాలెండర్‌లో రోజులను, నెలలను ఇష్టానుసారంగా మార్చేసేవారు.. ఉదాహరణకు రోమ్ చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేనాటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి.. దాంతో ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒకనెల అదనంగా చేరేది.. జూలియస్ కాసర్ రోమ్ చక్రవర్తి అయ్యాక క్యాలెండర్‌లో అనేక మార్పులు చేసారు. తద్వారా 365 రోజుల కేలండర్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రతీ నాలుగేళ్లకూ ఒక అదనపు రోజును ఆగష్ట్ నెలలో కలిపారు. దీని ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31, ఆగస్టుకు 29 రోజులు ఏర్పడ్డాయి.

అయితే మళ్లీ జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యారు. ఆయన పుట్టింది ఆగస్టులో.. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఆయన ఇష్టపడలేదట.. దాంతో ఆగస్టు నెలకు 2రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ పై ఈర్ష్యతో ఆయన పుట్టిన ఫిబ్రవరిలో రెండు రోజులు తగ్గించాడు.. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులు వచ్చాయి..

అప్పటినుండి లీపు ఇయర్ లో ఒక రోజును ఆగస్టుకి కాకుండా.. ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు.. అయితే ప్రస్తుతం వాడుకలో ఉన్న క్యాలెండర్లను మార్చే ఉద్దేశాలు ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేవు.. అందుకే ప్రతీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి ఒకరోజు కలిసి29 రోజులు వస్తున్నాయి. అందుకే లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న పుట్టినవారికి మిగిలినవారికంటే భిన్నంగా నాలుగేళ్లకోసారి పుట్టినరోజు వస్తూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి