iDreamPost

అఫిషియల్: క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన సూర్య!

హీరో సూర్య తాజాగా ఓ క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

హీరో సూర్య తాజాగా ఓ క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

అఫిషియల్: క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన సూర్య!

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10, 2023 పేరిట ఓ కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్రికెట్‌ టీమ్‌లకు సంబంధించిన రాష్ట్రాల వారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. గ్లోబర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగా హైదరబాద్‌ టీమ్‌ను కొనుగోలు చేశారు. ట్విటర్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో తాను హైదరాబాద్ టీమ్‌కు ఓనర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. గల్లీ క్రికెట్ కు వైభవం తీసుకొచ్చేందుకు, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ ఐఎస్పీఎల్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ లీగ్ లో హైదరాబాద్ కీర్తిని పెంచేందుకు అందరూ తనతో చేతులు కలపాలని కోరారు.

ఇప్పుడు స్టార్‌ హీరో సూర్యా కూడా ఓ టీమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10, 2023కి సంబంధించి చెన్నై టీమ్‌ను ఆయన కొన్నారు. ఈ మేరకు బుధవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ అందరికీ నమస్కారం.. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ 10కు సంబంధించి టీం చెన్నై ఓనర్‌షిప్‌ను ప్రకటించడానికి ఎంతో ఉత్సాహపడుతున్నాను. క్రికెట్‌ ఔత్సాహికులందరూ క్రీడల్ని ముందుకు తీసుకెళ్లడానికి నాతో చేతులు కలపండి’’ అని పేర్కొన్నారు.

కాగా, హీరో సూర్య సామాజిక సేవల విషయంలో ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. ప్రకృతి విపత్తులు తలెత్తినపుడు ఆయనే ముందుండి సాయం చేస్తున్నారు. అగరం ఫౌండేషన్‌ ద్వారా నిరుపేద విద్యార్థులను సైతం చదివిస్తున్నారు. ఆయనకు క్రీడలంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఓ క్రికేట్‌ టీంను కొనుగోలు చేశారు. ఇక, సూర్య 2022లో ‘ఈటీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తర్వాత విక్రమ్‌ సినిమాలో రోలెక్స్‌ పాత్రలో అలరించారు.

ప్రస్తుతం ఆయన ‘కంగువా’ అనే మూవీ నటిస్తున్నారు. తమిళ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కంగువ దాదాపు 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కనుంది. దాదాపు 30కిపైగా దేశాల్లో సినిమా విడుదల కానుంది. కంగువ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇది సూర్యకు 42వ చిత్రం కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా కంగువను నిర్మిస్తున్నాయి. 2024లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10లో సూర్య టీమ్‌ చెన్నైని కొనుగోలు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి