iDreamPost

హెరిటేజ్ ఎవరిది ??

హెరిటేజ్ ఎవరిది ??

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షం ఆరోపణలు , అధికార ప్రక్షం కౌంటర్లతో చలికాలంలో కూడా కాక పుటిస్తున్నాయి, ఈ సంధర్భంలో జరిగిన ఒక సంఘటన ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఉల్లి ధరల సమస్య గురించి అసెంబ్లీలో అధికార పక్షంని ఇరుకున పెట్టటానికి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి జగన్ గట్టి కౌంటర్ ఇచ్చారు, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రజలకు ఉల్లిని 25 రూపాయలకే రైతుబజార్లులో ఇవ్వలేదని కానీ తమ ప్రభుత్వం అందిస్తుందని, చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ లో కూడా కిలో 200 రూపాయలు చేసి ఉల్లి అమ్ముతున్నారు అని కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ మాటలకు ప్రతిస్పందిస్తూ, హెరిటేజ్ ఫ్రెష్ ని ఫ్యుచర్ గ్రుప్ కి ఆమ్మేశామని, హెరిటేజ్ ఫ్రెష్ కు తనకు ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ కు మద్య ఎలాంటి సంభందం లేదని చెప్పి తనకు హెరిటేజ్ ఫ్రెష్ తో సంబంధం ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరాడు. చంద్రబాబు చెప్తున్నట్టు నిజంగానే హెరిటేజ్ ఫ్రెష్ కి ఆయనకి సంభందంలేదా? దక్షిణ భారతదేశంలో పాతికేళ్ళుగా హెరిటేజ్ గ్రూప్ ని చంద్రబాబు ప్రమోట్ చెసిన విషయం తెలిసిందే, ఈ హెరిటేజ్ ప్రస్తానంలో ఎన్నో ఆరోపణలు దానిపై వచ్చాయి, ఏళ్ళ తరబడి అసెంబ్లీ లో ఇది ఒక హాట్ టాపిక్.

2004 నుండి 2009 వరకు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా 55 రూపాయల దగ్గర నుంచి 41 రూపాయలకు తగ్గిన హెరిటేజ్ షేర్ వాల్యు 2009 నుంచి 2014 మధ్య 200 రూపాయలకు పెరిగింది. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే 200 రూపాయల షేరు ఒక్కసారిగా వేయి రూపాయలకు చేరింది, ఇలా అమాంతంగా షేర్ వాల్యూ పెరగటంపై అనేక ఆరోపణలు వచ్చాయి.

Read Also : కేవీపీ వ్యూహంలో భాగంగానే విందు రాజకీయం నడుస్తోందా.?

ప్రధాని మోడి నోట్ల రద్దు నిర్ణయానికి కేవలం మూడు రోజుల ముందు హెరిటేజ్ రిటైల్ విభాగంలోని హెరిటేజ్ ఫ్రెష్ ను బిగ్ బజార్ యజమానులైన బియాని (ఫ్యూచర్) గ్రూప్ కు 296 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయం ద్వారా చంద్రబబు నాయుడికి చెందిన హెరిటేజ్ గ్రూప్ కు ఫ్యూచర్ గ్రూపులో 3. శాతం షేర్ దక్కింది. అంటే హెరిటేజ్ అమ్మకం నగదు రూపంలో కాకుండా వాటా బదలాయింపు రూపమ్లో జరిగింది. నోట్ల రద్దు సమయంలో షేర్ వాల్యు పెంచి వేరే కంపెనీకి బదలాయించటం వెనక పెద్ద కుంభకోణం ఉంది అని అప్పట్లో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇప్పుడు తాజాగా ఫ్యూచర్ గ్రూప్ కి బదలాయించిన హెరిటేజ్ ఫ్రెష్ తో తనకి సంభందంలేదు అని చంద్రబాబు చెప్పటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నగదు రూపంలో తన వాటాని అమ్మితే అక్కడితో హెరిటేజ్ తో సంభందం తెగేది కానీ షేర్ల రూపంలో బదలాయిస్తే వాటా ఎందుకు ఉండదు అనేది బిజినేస్ ఎనలిస్టుల నుండి వస్తున్న ప్రశ్న, ఈ లెక్కన అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టు ఇప్పటికి హెరిటేజ్ ఫ్రెష్ లో కూడా చంద్రబాబుకు వాటా ఉనట్టే భావించాలి, చూద్దాం దీనిపై చంద్రబాబు ఏమి సమాధనం ఇస్తారో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి