iDreamPost

#90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.. తప్పక చూడటానికి 5 కారణాలు!

#90's A Middle Class Biopic: ప్రస్తుతం అందరూ మంచి వెబ్ సిరీస్ సజీషన్ అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సిరీస్ ని రికమెండ్ చేయండి. బాగుందనడానికి 5 కారణాలు ఇవే.

#90's A Middle Class Biopic: ప్రస్తుతం అందరూ మంచి వెబ్ సిరీస్ సజీషన్ అడుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సిరీస్ ని రికమెండ్ చేయండి. బాగుందనడానికి 5 కారణాలు ఇవే.

#90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.. తప్పక చూడటానికి 5 కారణాలు!

సగటు తెలుగు కుటుంబానికి ఆట విడుపు ఏదైనా ఉంది అంటే అది సినిమా అనే చెప్పాలి. కానీ, రోజూ కొత్త సినిమాలు విడుదల కావు. అలాగనవి వచ్చినా కూడా ఇంటిల్లిపాది వెళ్లి థియేటర్లో సినిమా చూసే అంత తక్కువ ధరల్లో టికెస్ట్ కూడా లేవు. అందుకే అందరూ ఇంట్లో ఉండి టీవీ చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగని రోజూ సీరియల్స్ చూడమన్నా పిల్లలు గోల చేస్తారు. ఇప్పుడు అందరికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేందుకు ఓటీటీల రూపంలో మంచి ఆవకాశం ఉంది. అయితే ఎలాంటి వెబ్ సిరీస్ చూడాలి? ఏటీటీలో ఏ సినిమా చూడాలి అనే విషయాన్ని తేల్చుకోవాలి అంటే మూవీ చూసినంత సమయం పడుతుంది. అందుకే మీకోసం ఈ ఆర్టికల్ రూపంలో ఒక వెబ్ సిరీస్ సజీషన్ తీసుకొచ్చాం. తాజాగా విడుదలైన #90’s వెబ్ సిరీస్ ని ఎందుకు చూడాలో 5 కారణాలు కూడా చెప్తాం.

చైల్డ్ హుడ్ మెమరీస్:

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లోనే కాకుండా.. నెట్టింట కూడా బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. అందరినీ ఈ వెబ్ సిరీస్ మెప్పిస్తోంది కాబట్టి. అందుకు తొలి కారణం ఏంటంటే.. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు మీకు మీ చిన్నతనం గుర్తొస్తుంది. మీ చైల్డ్ హుడ్ మెమొరీస్ మొత్తం అలా మీ కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. మీరు స్కూలుకు వెళ్లే రోజులు.. మార్కులు సరిగ్గా రాకపోతే టీచర్ చేతిలో మొట్టికాయలు, ఫస్ట్ ర్యాంకర్ కి అయితే క్లాస్ టాపర్ కార్తిక్ అనే బిరుదులు.. ఇవన్నీ మీ మదిలో గిలిగింతలు పెడతాయి. కాసేపు మీరు మీ స్కూల్ కి, మీ క్లాస్ కి, స్కూల్లో మీ చెడ్డీ గ్యాంగ్ దగ్గరకి వెళ్లిపోతారు.

మధ్య తరగతి కష్టాలు:

దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల్లో దాదాపుగా మధ్యతరగతి ఫ్యామిలీసే అధికం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో తమ ఇంట్లో చిన్న కష్టాన్ని అయినా చూసే ఉంటారు. స్కూలు ఫీజు కట్టడానికో, మీకు యూనిఫారమ్ కుట్టించడానికో, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనడానికో.. కారణం ఏదైనా అమ్మానాన్నలు మదనపడిపోయిన సందర్భాలు చాలానే చూసుంటారు. కుటుంబాన్ని నడపడానికి అమ్మా- నాన్న ఎంత కష్టపడ్డారో? ఆ రోజుల్లో మీకు అర్థం అయి ఉండకపోవచ్చు. అప్పటి వయసు అలాంటిది. ఎంతోమంది మన పరిస్థితి తెలియకుండా తల్లిందండ్రులను అది కావాలి, ఇది కావాలి అంటూ ఏడిపించిన సందర్భాలు ఉండనే ఉంటాయి. అలాంటి సమయాల్లో పేరెట్స్ పరిస్థితి, ఇంటిని సరిగ్గా నడపంలో వారిమధ్య ఉండే అండర్ స్టాండింగ్, ముఖ్యంగా కష్టాన్ని వంటగది గడప దాటకుండా అమ్మ చేసే ప్రయత్నాలు అన్నీ మీకు గుర్తొస్తాయి. మీ కళ్ల చెమ్మగిల్లేలా చేస్తాయి.

స్వచ్ఛమైన కామెడీ:

సాధారణంగా ఇప్పుడు కామెడీకి అర్థం మారిపోయింది. బాడీ షేమింగ్ డైలాగ్స్, ఇష్టారీతిన మీద పడి కొట్టేయడాలు, రండు డబులు మీనింగ్ డైలాగ్స్ వేసేసి దాన్నే కామెడీ అన్నట్లు చూపించే పరిస్థితి కూడా ఉంది. కానీ, ఈ వెబ్ సిరీస్ లో మాత్రం అలాంటి సీన్స్, డైలాగ్స్ ఉండవు. అలాంటి రోత అస్సలు ఉండదు. ఇందులో ఎంతో స్వచ్ఛమైన కామెడీ ఉంటుంది. అది చూసిన ఆడియన్స్ ని కూడా ఎంతగానో అలరిస్తుంది.

ఫ్యామిలీ అంతా చూడచ్చు:

సాధారణంగా సినిమాలకు సెన్సార్ ఉంటుంది. అందుకే సీన్స్, డాలాగ్స్ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ, వెబ్ సిరీస్ లకు సెన్సార్ ఉండదు. ఉన్న కంటెంట్ ని బట్టి ఏజ్ కేటగిరీ మెన్షన్ చేస్తారు. మీరు అది చూసుకోకుండా ఏది పడితే అది ప్లే చేస్తే చాలానే సమస్యలు వస్తాయి. అందుకే ఒకటి రెండుసార్లు చూసుకుని ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ వెబ్ సిరీస్ విషయంలో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూడచ్చు. ఇందులో నరుక్కోడాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి ఉండవు. బీప్ లు వేసే పరిస్థితి అస్సలు ఉండదు. అందుకే ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంచక్కా చూసేయచ్చు.

నటన అద్భుతం:

ఈ మధ్య కాలంలో ఇలాంటి యాక్టింగ్.. ఓ మూవీలో టీమ్ అంతా కలిసి చేయడం చూసి ఉండం. ఒక తండ్రి, తల్లి, అన్నా, అక్క, తమ్ముడు ఇలా అన్ని పాత్రలు ఎంతో చక్కగా కలిసి.. అత్యద్భుతంగా నటించడం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక నటన మీకు ఈ వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. పేరెంట్ గా శివాజీ- వాసుకీ, తోబుట్టువులుగా మౌళీ తనూజ్ ప్రశాంత్, వాసంతిక, రోహన్ రాయ్ ఎంతో చక్కగా నటించారు. వీళ్ల నటన చూసిన తర్వాత ఎంతో ప్యూర్ గా అనిపిస్తుంది. నటన అనే దానికంటే ఒక్కొక్కరు ఆ పాత్రలో జీవించారనే చెప్పాలి. పైగా ఆ పాత్రలో మనల్ని మనం చూసుకుంటాం. అందుకే #90’s వెబ్ సిరీస్ కి ఎంతో మంచి ఆదరణ లభిస్తోంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ చూస్తూ.. మీ 90’s రోజులకు వెళ్లిరండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి