iDreamPost

వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్ప పీడనం, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్ప పీడనం, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్ప పీడనం ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు కదులుతూ మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. దీనికి ఉపరితల ఆవర్తనం, నైరుతి రుత పవన ద్రోణి కూడా తోడవడంతో ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఏపీలోని మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

తీవ్ర అల్ప పీడన ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలకు గాను IMD అధికారులు ఉత్తర తెలంగాణకు ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ లో మంగళవారం కూడా ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి