iDreamPost

హార్దిక్‌ పాండ్యా కారణంగానే ముంబై ఓడిపోయింది: దిగ్గజ క్రికెటర్‌

  • Published Apr 15, 2024 | 1:00 PMUpdated Apr 15, 2024 | 1:00 PM

Hardik Pandya, Sunil Gavaskar, CSK vs MI: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడానికి కారణం పాండ్యా అంటూ దిగ్గజ క్రికెటర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Sunil Gavaskar, CSK vs MI: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడానికి కారణం పాండ్యా అంటూ దిగ్గజ క్రికెటర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 15, 2024 | 1:00 PMUpdated Apr 15, 2024 | 1:00 PM
హార్దిక్‌ పాండ్యా కారణంగానే ముంబై ఓడిపోయింది: దిగ్గజ క్రికెటర్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమికి రోహిత్‌ శర్మ కారణమంటూ కొంతమంది, లేదు హార్దిక్‌ పాండ్యా చెత్త బౌలింగ్‌, చెత్త కెప్టెన్సీ కారణమంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, ప్రముఖ కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఓటమికి హార్దిక్ కారణం అని మండిపడ్డాడు. గత కొంతకాలంగా తాను చూసిన చెత్త బౌలింగ్ హార్దిక్‌ పాండ్యాదే అని విమర్శించాడు. సీఎస్‌కే వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఫలితంపై తనదైన స్టైల్‌లో విశ్లేషించాడు సునీల్‌ గవాస్కర్‌.

ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69, శివమ్ దూబె 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేసి అదరగొట్టారు. ఇక లాస్ట్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోనీ 4 బంతుల్లో 3 సిక్సులతో 20 పరుగులు చేసి.. సీఎస్‌కేను 200 మార్క్‌ దాటించాడు.

ధోనీ దెబ్బకి చివరి ఓవర్‌ వేసిన ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 207 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 రన్స్‌ చేసినా.. ముంబైని గెలిపించలేకపోయాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో పాండ్యా చివరి ఓవర్‌ వేయడంపై గవాస్కర్‌ తప్పుబట్టాడు. పాండ్యా బౌలింగ్‌ చూస్తే.. తన హీరో కోసం సమర్పించుకుంటాను అన్నట్లుగా ఉంది. ధోని సిక్సర్లు కొట్టాలనే ఉద్దేశంతోనే పాండ్యా బౌలింగ్‌ వేసినట్లు కనిపిస్తోంది. ఆ ఓవర్‌లో ఫస్ట్‌ సిక్స్‌ ఓకే.. కానీ, తర్వాతి బంతిని కూడా లెంగ్త్ బాల్ వేశాడు. బ్యాటర్ దాని కోసమే ఎదురుచూస్తాడని తెలుసు. ఇక మూడో బంతి లెగ్ సైడ్ ఫుల్ టాస్ వేశాడు. ధోనీ దాని కోసమే ఎదురుచూసి.. సిక్స్‌ కొట్టాడు. ఇది కచ్చితంగా ఆర్డినరీ బౌలింగ్, ఆర్డినరీ కెప్టెన్సీ. చెన్నైని 185-190 పరుగులకే కట్టడి చేయాల్సిందని గవాస్కర్‌ పేర్కొన్నాడు. మరి ముంబై ఓటమికి పాండ్యా కారణమంటూ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి