iDreamPost

వెంకీ – ఏ కంప్లీట్ ఫ్యామిలీ హీరో

వెంకీ – ఏ కంప్లీట్ ఫ్యామిలీ హీరో

స్టార్ హీరో ఎవరైనా ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డాక అతనికంటూ ఒక ఇమేజ్ ఏర్పడిపోయి ఎలాంటి కథలు ఎంచుకోవాలో శాశిస్తుంది. దానికి ఏ మాత్రం రివర్స్ లో వెళ్లినా అంచనాలు తలకిందులై సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ కొందరు మాత్రమే రిస్క్ కు ఎదురీది భేషజాలు పెట్టుకోకుండా వినూత్న ప్రయోగాలతో అందరికీ దగ్గరవుతారు. అందులో విక్టరీ వెంకటేష్ ఒకరు. 1986లో నిర్మాత రామానాయుడు గారి పిలుపు మేరకు యుఎస్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన వెంకీకి అప్పటికి నటనలో ఓనమాలు తెలియవు. కష్టపడి నేర్చుకుని తండ్రి కోరికను మన్నించి హీరోగా స్థిరపడాలనే లక్ష్యంతో కలియగ పాండవులతో తొలిసారి కెమెరా ముందు వచ్చారు.

డెబ్యూనే ఏదో లవ్ స్టోరీ కాకుండా క్లిష్టమైన సోషల్ సబ్జెక్టును ఎంచుకున్నప్పటికీ తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల్లో మొదటి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. శ్రీనివాస్ కళ్యాణం లాంటి సాఫ్ట్ మూవీ చేసినా, ఒకేసారి బ్రహ్మపుత్రుడు లాంటి కమర్షియల్ చిత్రం స్వర్ణకమలం లాంటి కళాత్మక సినిమా చేసినా ఆర్టిస్టుగా ఒక్కో మెట్టు ఎక్కుతూనే పోయారు. 1990లో బొబ్బిలిరాజాతో మాస్ కి దగ్గరైన వెంకటేష్ ఆ తర్వాత కూలి నెంబర్ 1, చంటి ఘనవిజయాలుతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ప్రేమ, ధర్మచక్రం లాంటి ఇంటెన్స్ ఉన్న సినిమాలతో నంది అవార్డులనూ గెలుచుకున్నారు. ప్రేమించుకుందాం రాతో యూత్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు

1997లో రేప్ కు గురైన అమ్మాయిని చేరదీసి పాత్రలో పెళ్లి చేసుకుందాం, మెడికల్ మాఫియాని నిలదీసే గణేష్ ఇలా వైవిధ్యమైన క్యారెక్టర్లతో కెరీర్ ని చక్కగా నిర్మించుకున్నారు. రాజాలో నటనకు కంటతడి పెట్టనివారిని చూడటం కష్టమే. కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి, మల్లేశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలతో కుటుంబ ప్రేక్షకులు తమవాడిగా సొంతం చేసుకున్నారు. ఎఫ్2 నవ్వులు పంచినా దృశ్యంలో టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించినా, ఓరి దేవుడాలో ప్రత్యేక పాత్ర పోషించినా వెంకీకి మాత్రమే సాధ్యమయ్యింది. అందుకే డిసెంబర్ 13 తన పుట్టినరోజు అభిమానులకు ఓ పండగ లాంటిది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి