iDreamPost

దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రోజే పండుగ

దసరా సెలవుల్లో మార్పులు.. ఆ రోజే పండుగ

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రీతిపాత్రంగా చేసుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. తొమ్మిది రోజులు పాటు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దసరా నవరాత్రుల్లో దేవాలయాలతో పాటు నగరాలు, గ్రామాలు కళకళలాడుతుంటాయి. దసరా వస్తుందంటే చాలు.. తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతుంటారు నగర వాసులు. ఇక స్కూల్ పిల్లలు సైతం దసరా హాలిడేస్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే ఉద్యోగస్థులు కూడా దసరా సెలవులు ఎప్పుడు వస్తాయనా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవల తగులు.. మిగులు లెక్కన పండుగలు వస్తుండటంతో ఎప్పుడు జరుపుకోవాలో, ఎప్పుడు సెలవులో తెలియక ప్రజల్లో సందిగ్దత నెలకొంటోంది. ఈ నేపథ్యంలో దసరా సెలవును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

గతంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పడు ఆ సెలవుల్లో మార్పులు చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదీకీ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అక్టోబర్ 24వ తేదీని కూడా సెలవుదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.  అలాగే స్కూల్ విద్యార్థులకు సెలవులతో పాటు, మిగిలిన వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఆప్షనల్‌ హాలిడేగా ఇచ్చింది. ఇప్పటికే స్కూల్ పిల్లలకు 13 రోజులు, జూనియర్ కాలేజీలకు వారం రోజులు సెలవులు ఇచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి