iDreamPost
android-app
ios-app

జీతం అడిగినందుకు ఉద్యోగిపై లేడీ బాస్ దారుణం

పొద్దున్నే లేచి, ఉరుకుల పరుగులు పెట్టి.. దూర భారాలు ప్రయాణం చేస్తూ.. ఉద్యోగాలకు వెళుతుంటారు. కుటుంబ పోషణ, ఆర్థిక అవసరాలు మనిషిని.. నెలంతా పనిచేసే జీతానికి కట్టిపడేస్తాయి. ఈ జీతం సగటు మానవుడికి చాలా అవసరం. కానీ ఈ జీతమే రాదని తెలిస్తే..

పొద్దున్నే లేచి, ఉరుకుల పరుగులు పెట్టి.. దూర భారాలు ప్రయాణం చేస్తూ.. ఉద్యోగాలకు వెళుతుంటారు. కుటుంబ పోషణ, ఆర్థిక అవసరాలు మనిషిని.. నెలంతా పనిచేసే జీతానికి కట్టిపడేస్తాయి. ఈ జీతం సగటు మానవుడికి చాలా అవసరం. కానీ ఈ జీతమే రాదని తెలిస్తే..

జీతం అడిగినందుకు ఉద్యోగిపై లేడీ బాస్ దారుణం

మనిషి బతికేందుకు తిండి, వస్త్రం, గూడు అవసరం. ఇవి కావాలంటే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఈ సొమ్ములను సంపాదించేందుకు మానవుడు కష్టపడుతుంటాడు. చదువుకు తగిన ఉద్యోగాలు దొరికినా, దొరక్కపోయినా పని చేసి సంపాదించి కుటుంబ పోషణకు లేదా ఫ్యామిలీకి అండగా నిలవాలని అనుకుంటారు. అందుకోసం ఉద్యోగం చేస్తుంటాడు. జాబ్‌లో బాస్ తిట్టినా, అరిచినా.. మిన్నకుండిపోయేది ఆ జీతం కోసమే. ఎన్ని సమస్యలు వచ్చినా.. అడ్డంకులు వచ్చినా నెల మొదట్లో వచ్చే జీతం కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్క రోజు అటు ఇటు జీతం ఆలస్యమైతే విలవిలలాడిపోతుంటాడు వేతన జీవి. అలాంటిది జీతం ఇవ్వకుండా తిప్పించుకోవడమే కాకుండా వికృత చేష్టలకు పాల్పడిందో బిజినెస్ ఉమెన్.

జీతం ఇవ్వకుండా వేధించడమే కాకుండా.. తన చెప్పులను ఓ దళిత ఉద్యోగిని నోట్లో కుక్కి హింసకు గురి చేసిన మహిళా వ్యాపారితో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన గుజరాత్‌లోని మోర్బిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాణిబా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహిళా వ్యాపార వేత్త విభూతి పటేల్.. అక్టోబర్ నెలలో రూ. 12 వేల జీతంతో నీలేష్ దల్సానియా అనే యువకుడ్ని పనిలో పెట్టుకుంది. అయితే అక్టోబర్ 18న అతడిని పనిలో నుండి తొలగించింది. అయితే తనకు రావాల్సిన 16 రోజుల జీతం.. తనకు ఇవ్వాలంటూ దల్సానియా.. యజమానిని కోరినప్పుడు.. ఏం సమాధానం చెప్పలేదు సరికదా.. ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో బుధవారం సాయంత్రం దల్సానియా.. తన సోదరుడు, మరికొంత మందితో కలిసి విభూతి పటేల్ కంపెనీకి వెళ్లాడు.

పెండింగ్‌లో ఉన్న తన జీతం ఇవ్వాలని కోరాడు నీలేష్ దల్సానియా. దీంతో మహిళా వ్యాపార వేత్త విభూతి, ఆమె సోదరుడు ఓం పటేల్, సహచరులు.. అతడిపై దాడికి పాల్పడ్డారు. దల్సానియాను విభూతి చెప్పుతో కొట్టి, తన కార్యాలయం కాంప్లెక్ పైకి తీసుకెళ్లి.. ఇష్టమొచ్చినట్లు దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చెప్పులను అతడి నోటిలో కుక్కమని విభూతి బలవంతం చేసిందని, తనను జీతం డిమాండ్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కోరినట్లు దల్సానియా పేర్కొన్నారు. ఈ చుట్టు పక్కల మళ్లీ కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరించారంటూ తెలిపాడు. అంతేకాకుండా.. డబ్బు దోచేందుకు తన కార్యాలయానికి వచ్చినట్లు ఒప్పుకోవాలంటూ దాడి చేశారని చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. విభూతితో సహా ఆరుగురిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలు సెక్షనన్లను నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి