iDreamPost

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో AP నెంబర్ వన్..

ఢిల్లీలో  భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన లో ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో  భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన లో ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో AP నెంబర్ వన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమ పథకాలను, అభివృద్ధిని జొడెద్దుల్లా పరిగెత్తిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కొత్త  పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చేందుకు అనుకూల వాతావరణం సృష్టించారు. గతంలో విశాఖపట్నం వేదికగా జరిగిన వ్యాపార వేత్తల సదస్సే అందుకు నిదర్శనం. ఇప్పటికే పరిశ్రమలు, పెట్టుబడుల ఆకట్టుకునే విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పొల్చితే ఏపీ ముందుంది. తాజాగా ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ గా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని  మంత్రి అమర్నాథ్ అన్నారు. ఢిల్లీలో  భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన లో ఏపీ పెవిలియన్ ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది. ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి అనేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపీ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు  అందిస్తున్న ప్రోత్సాహకాలు, తయారయ్యే వస్తువుల స్టాల్స్ ను ఈ ప్రోగ్రామ్ లో ఏర్పాటు చేశారు. ఏపీ పెవిలియన్ లో జగన్ సర్కార్ అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న కాలనీల నమూనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అంతేకాక ఏపీ పెవిలియన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు.

AP in first place at ease of doing bussiness

అంతేకాక ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడుల ఆకర్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, ఫిపింగ్ హార్బర్  ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఏపీలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్ లు ఉన్నాయని,  45 వేల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని మంత్రి పేర్కొన్నారు.  తమ ప్రభుత్వం హయాంలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఏపీలో ఇండస్ట్రీయల్ గ్రోత్ రేటు 11.43 తో  అందరి కంటే ముందుందని వెల్లడించారు. ఎగుమతులలో ఏపీ ఆరోస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో అతిథులు వచ్చారు. ఈ కార్యక్రమం  ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్స్ అందరిని తెగ ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి